• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »బ్రేకింగ్ న్యూస్

తాడిపత్రిలో రెండు ముక్కలైన ట్రాక్టర్

ATP: తాడిపత్రి రూరల్ పరిధిలోని ఆర్డీటీ కాలనీ సమీపంలో మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. వేగంగా వచ్చిన కారు ట్రాక్టర్‌ను బలంగా ఢీకొనడంతో ట్రాక్టర్ ఇంజన్ భాగాలు రెండుగా విడిపోయాయి. ప్రమాదం జరిగిన సమయంలో కారులోని సేఫ్టీ బెలూన్లు (ఎయిర్ బ్యాగులు) తెరుచుకోవడంతో ప్రయాణికులు ప్రాణాపాయం నుంచి తృటిలో తప్పించుకున్నారు.

February 25, 2026 / 08:00 AM IST

బాలిక ఘాతకం.. అమ్మ, తమ్ముడి హత్య

ప్రేమ పెళ్లికి ఒప్పుకోలేదని ఒడిశాకు చెందిన 16 ఏళ్ల బాలిక తన ప్రియుడితో కలిసి తల్లిని, తమ్ముడిని హత్యచేసింది. అనంతరం వారి మృతదేహాలను సమీప కాలువలో పడేసింది. కొరాపుట్ జిల్లా బొరిగుమ్మలో సోమవారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాలిక తమ్ముడు ఈహేం పరిఢా(14) మృతదేహం లభ్యం కాగా.. తల్లి అనుష్క(45) బాడీ కోసం పోలీసులు గాలిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

February 25, 2026 / 07:30 AM IST

బాలికను వేధిస్తున్న యువకుడిపై కేసు నమోదు

E.G: గోకవరం మండలంలోని ఓ పాఠశాలలో 7వ తరగతి చదువుతున్న బాలికను వేధించిన రాకేశ్ అనే యువకుడిని పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. నిందితుడు నిత్యం వేధిస్తున్నాడని బాలిక తల్లి ఫిర్యాదు చేయడంతో గోకవరం SI పవన్ కుమార్ కేసు నమోదు చేశారు. నిందితుడిని రాజంమహేంద్రవరం కోర్టులో హాజరుపరిచినట్లు ఆయన పేర్కొన్నారు.

February 25, 2026 / 07:20 AM IST

రొయ్యల చెరువులో మృతదేహం లభ్యం

E.G: నిడదవోలు మండలం సమిశ్రగూడెంలోని రొయ్యల చెరువులో మంగళవారం ఒక మృతదేహం లభ్యమైంది. మృతుడిని వెస్ట్ బెంగాల్‌కు చెందిన మోతీ పరదార్‌గా పోలీసులు గుర్తించారు. సమాచారం అందుకున్న సమిశ్రగూడెం SI సుందర్ బాలాజీ రావు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. మృతికి గల కారణాలపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.

February 25, 2026 / 06:00 AM IST

నల్లమాడలో జూదరుల అరెస్ట్

సత్యసాయి: నల్లమాడ మండల పరిధిలోని రెడ్డిపల్లి ప్రాంతంలో జూదం ఆడుతున్న ఐదుగురిని పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ. 4,800 నగదును స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై సతీష్ కుమార్ తెలిపారు. రహస్య సమాచారం మేరకు తన సిబ్బందితో కలిసి జూద స్థావరంపై ఆకస్మిక దాడి నిర్వహించినట్లు పేర్కొన్నారు.

February 25, 2026 / 05:30 AM IST

దారుణం.. వదిన గొంతు కోసిన మరిది

TG: యాదాద్రి జిల్లా పాలడుగులో దారుణం చోటుచేసుకుంది. మాటామాటా పెరగడంతో అన్న భార్య వెంకటమ్మ గొంతును మరిది బొంత అశోక్ కత్తితో కోశాడు. అశోక్ అన్న నర్సింహ ఇటీవలే మరణించగా.. ఇరు కుటుంబాల మధ్య భూ తగాదాపై కోర్టులో కేసులు నడుస్తున్నాయి. ఈ క్రమంలో మంగళవారం వెంకటమ్మతో అశోక్, అతని ఇద్దరు మనవళ్లు గొడవపడ్డి గొంతు కోశారు. ప్రస్తుతం ఆమె చికిత్స పొందుతుండగా.. పోలీసులు కేసు నమోదు చేశారు.

February 24, 2026 / 11:14 PM IST

చెరువులో గల్లంతు.. ఇద్దరి మృతదేహాలు వెలికితీత

TG: మహబూబ్‌నగర్ జిల్లాలో చెరువులో గల్లంతైన ఇద్దరి మృతదేహాలను వెలికితీశారు. రెండు రోజుల క్రితం జడ్చర్ల మండలం గొల్లపల్లి చెరువులో ఈతకు వెళ్లి ఇద్దరు యువకులు గల్లంతయ్యారు. మృతులు నవీన్, యాదగిరిగా గుర్తించారు. వారి మృతదేహాలను గ్రామస్తులు ఈ రోజు బయటకు తీశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

February 24, 2026 / 08:36 PM IST

భారీ ఆపరేషన్.. 104 మంది అరెస్ట్

TG: ఆపరేషన్ ఆక్టోపస్ పేరిట సైబర్ క్రైమ్ పోలీసులు ప్రత్యేక ఆపరేషన్ చేపట్టారు. ఈ నేపథ్యంలో 16 రాష్ట్రాల్లో 104 మంది నిందితులను అరెస్టు చేశారు. మ్యూల్ ఖాతాదారులు, సరఫరాదారులు, బ్యాంకు అధికారులను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ.36 లక్షలు, 204 సెల్‌ఫోన్లు, 141 సిమ్‌లు, అలాగే 152 బ్యాంకు పాస్ పుస్తకాలు, 26 ల్యాప్‌టాప్‌లు జప్తు చేశామని తెలిపారు.

February 24, 2026 / 07:10 PM IST

ఇంట్లో పేలిన గ్యాస్ సిలిండర్.. మహిళ సజీవ దహనం

AP: విజయనగరం జిల్లా హుకుంపేటలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఓ ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలి మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో భవానీ అనే వివాహిత సజీవ దహనమైంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని మంటలు అదుపు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

February 24, 2026 / 06:57 PM IST

మోహన్‌బాబు యూనివర్సిటీలో విద్యార్థిని ఆత్మహత్య

AP: తిరుపతిలో దారుణం చోటుచేసుకుంది. మోహన్‌బాబు యూనివర్సిటీలో ఇంజనీరింగ్ విద్యార్థిని భూమన ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలి స్వస్థలం అన్నమయ్య జిల్లా పుంగనూరు మండలంలోని మంగళం గ్రామంగా గుర్తించారు. భూమన మృతదేహాన్ని రియా ఆసుపత్రికి తరలించారు. తమ కూతురిది ఆత్మహత్య కాదని.. హత్యేనని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

February 24, 2026 / 06:31 PM IST

డ్రగ్స్ సరఫరా.. పలువురు అరెస్ట్

TG: ఇద్దరు డ్రగ్ పెడ్లర్లు, ఏడుగురు వినియోగదారులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈగల్ బృందం, జగదిరిగుట్ట పోలీసులు సంయుక్తంగా ఆపరేషన్ చేపట్టారు. మూసాపేట్ కేంద్రంగా డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు గుర్తించారు. ఎక్కడి నుంచి డ్రగ్స్ రవాణా చేస్తున్నారన్న కోణంలో దర్యాప్తు చేపట్టారు.

February 24, 2026 / 06:24 PM IST

కారు, ఆర్టీసీ బస్సు ఢీ.. తప్పిన ప్రమాదం

ATP: శింగనమల మండల కేంద్రంలోని శివపురం పెద్దమ్మ గుడి వద్ద మంగళవారం ఆర్టీసీ బస్సు, కారు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాకపోవడంతో బస్సులోని ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. ఆర్టీసీ బస్సు అనంతపురం నుంచి తార్పర్తి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

February 24, 2026 / 06:19 PM IST

బావను నరికి చంపిన మరదలు

TG: మొగిలయ్య(70) అనే వ్యక్తి తన మరదలు(50) నరికి చంపిన ఘటన హన్మకొండ జిల్లా హాసన్‌పర్తిలో జరిగింది. భార్య చనిపోవడంతో మొగిలయ్య తన మరదలితో సహజీవనం చేస్తున్నాడు. వీరిద్దరి మధ్య నెలకొన్న ఘర్షణ అతడి మరదలు చంపినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

February 24, 2026 / 05:30 PM IST

పసికందును పొయ్యిలో వేసి చంపిన తల్లి

TG: HYDలోని దుండిగల్ బౌరంపేటలో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. ఓ కసాయి తల్లి రెండు నెలల బాలుడిని కట్టెల పొయ్యిలో వేసి చంపింది. ఆ చిన్నారి అరుపులు ఎవరికీ వినపడకూడదని నోట్లో గుడ్డలు కుక్కి, కాళ్లు కట్టేసింది. ఈ ఘటనసై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితురాలిని అదుపులోకి తీసుకున్నారు. అయితే ఆ చిన్నారిని చంపడానికి గల కారణం ఏంటనేది తెలియరాలేదు.

February 24, 2026 / 03:57 PM IST

ఫేస్‌బుక్ పోస్టులు.. కానిస్టేబుల్ భార్య ఆత్మహత్య

AP: అనంతపురంలో ఫేస్‌బుక్ పోస్టులతో మనస్తాపానికి గురైన ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. ఓ కానిస్టేబుల్ భార్య ఫేస్‌బుక్‌లో కొన్ని పోస్టులు చేశారు. ఆమె పోస్టుల కింద మరో కానిస్టేబుల్ అసభ్య మెసేజ్‌లు పెట్టాడు. వీటిని భర్త చూడడంతో దంపతుల మధ్య గొడవ జరిగింది. అనంతరం భార్యతో భర్త ఫిర్యాదు చేయించారు. ఈ ఘటనతో ఆమె ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు.

February 24, 2026 / 03:31 PM IST