SKLM: బలగ మెట్టు జంక్షన్ వద్ద N. శ్యామల అనధికారికంగా మద్యం విక్రయిస్తుండడంపై రెండో పట్టణ పోలీసులకు వచ్చిన సమాచారం మేరకు మంగళవారం దాడులు నిర్వహించారు. ఈ మేరకు ఆమె నుంచి రూ. 2, 530 విలువ చేసే 21 అక్రమ మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్నారు. ఆమెపై సీఐ ఈశ్వర్ ప్రసాద్ కేసు నమోదు చేసి, అరెస్టు చేసినట్లు తెలిపారు.
NLR: ఓ బాలికను ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని కిడ్నాప్ చేసి హైదరాబాద్‌కు తీసుకెళ్లి లైంగిక దాడి చేసిన సూళ్లూరుపేట సాయినగర్‌కు చెందిన భానుప్రకాష్ (23), అతడికి సహకరించిన మరో ఐదుగురిపై 2014లో పోక్సో నమోదైంది. జడ్జి సిరిపిరెడ్డి సుమ విచారణ చేపట్టి పదేళ్ల శిక్షతోపాటు రూ. 20 వేలు జరిమానా విధిస్తూ తీర్పు ఇచ్చారు.
పల్నాడు: బొల్లాపల్లి(M) వెల్లటూరు సమీపంలోని కాలువలో నాగరాజు, భార్గవి దూకిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో నాగరాజు(37) చనిపోగా, భార్గవి అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో ఆస్పత్రికి తరలించారు. కాగా, వీరిద్దరికీ వేరువేరుగా పెళ్లిళ్లు జరిగి పిల్లలున్నారు. కలిసి బతకలేమని గ్రహించి బంధువుల ఎదుటే కాలువలో దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారని పోలీసులు తెలిపారు.
KMM: వైరా మండలంలో మంగళవారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. పినపాక బ్రిడ్జి వద్ద ఎదురెదురుగా రెండు కార్లు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఐదుగురు వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. ఘటనా స్థలానికి చేరుకున్న ఎస్సై వంశీ కృష్ణ క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
CTR: శాంతిపురం(M) గుండి శెట్టిపల్లి ఎస్సీ కాలనీకి చెందిన మహేంద్ర విద్యుత్ షాక్‌తో మృతి చెందాడు. గుండిశెట్టిపల్లి సమీపంలోని విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద ప్రమాదవశాత్తు మహేంద్ర(17) విద్యుత్ షాక్‌కు గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. మహేంద్ర శాంతిపురం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు.
కృష్ణా: ముదినేపల్లి మండలం చినపాలపర్రుక చెందిన యువకుడు పి.అజయ్ బాబు (19) ఆత్మహత్యాయత్నాం చేసుకున్నాడు. కుటుంబ సభ్యుల వివరాలు.. ప్రేమికురాలు తిరస్కరించిందని ఈనెల 22న పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు. విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు. అతని తండ్రి వెంకట సుబ్బారావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్సై కేసు నమోదు చేశారు.
కృష్ణా: మండలంలోని పెడసనగల్లు జడ్పీ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న వి.రామకృష్ణను సోమవారం కంకిపాడు టోల్ ప్లాజా వద్ద కారు ఢీ కొట్టింది. గాయాలపాలైన ఆయనను సిటీ న్యూరో సెంటర్‌కు చికిత్స నిమిత్తం తరలించారు. చికిత్స అందుతుండగా ఆయన మంగళవారం మరణించారని మొవ్వ మండల ఏపీ టీచర్స్ ఫెడరేషన్ తాజాగా ఓ ప్రకటన విడుదల చేసింది. పాఠశాలలో విషాదఛాయలు అలుముకున్నాయి.
AKP: ద్విచక్ర వాహనంపై అక్రమంగా తరలిస్తున్న 3.5 కేజీల గంజాయి పట్టుకున్నామని కృష్ణదేవిపేట ఎస్సై వై. తారకేశ్వరరావు తెలిపారు. ముందస్తు సమాచారం మేరకు మంగళవారం ఏఎల్.పురం రత్నంపేట జంక్షన్ వద్ద వాహనాల తనిఖీలు చేపట్టగా.. ఈ గంజాయిని పట్టుకున్నామని చెప్పారు. ఈ గంజాయిని తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసామన్నారు.
VZM: బొబ్బిలి హైవేపై అదివారం స్కూటీపై ప్రయాణిస్తున్న యువకుడుని లారీ ఢీ కొట్టింది. గుర్ల మండలం గొలగంకి చెందిన నడిమువలస రాంబాబు (26) బొబ్బిలిలో ఓ శుభకార్యానికి వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. రెండు రోజులుగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు. మృతుడికి భార్య, కుమారుడు, కుమారై ఉన్నారు.
CTR: పెనుమూరు మండలం గుడ్యనంపల్లె గ్రామానికి చెందిన మోహన్ ఆచారి(36) గత పది సంవత్సరాల క్రితం సరిత అనే మహిళను వివాహం చేసుకున్నాడు. వీరికి ఒక కుమారుడు. అయితే తన భార్య గ్రామ సచివాలయ ఉద్యోగితో అక్రమ సంబంధం ఏర్పరచుకోవడంతో తీవ్ర మనస్థాపానికి గురైన మోహన్ఆచారి ఓ క్వారీ గుంతలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. పెనుమూరు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
తిరుపతి జిల్లా సత్యవేడు మండలం పెద్దఈటిపాకం సమీపం వద్ద మంగళవారం శ్రీ సిటీ పోలీసులు అక్రమ రేషన్ బియ్యం సరఫరాపై నిఘా పెట్టి దాడులు చేశారు. మినీ టెంపో వాహనంలో సుమారు రెండున్నర టన్నుల రేషన్ బియ్యం తరలిస్తుండగా చాకచక్యంగా పట్టుకోవడం జరిగింది. నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నట్లు సమాచారం. పూర్తిస్థాయి వివరాలు తెలియాల్సి ఉంది.
ప్రకాశం: ముండ్లమూరు మండలంలోని ఉలవగల్లు సమీపంలో లారీ నుంచి ఓ వ్యక్తి దూకిన ఘటన మంగళవారం చోటుచేసుకుంది. కొరిసపాడు మండలంలోని తమ్మవరం గ్రామానికి చెందిన సిహెచ్. ఆంజనేయులు తన మిత్రులతో కలిసి లారీలో త్రిపురాంతకం వెళ్తున్నాడు. అయితే ఆ సమయంలో మద్యం మత్తులో ఉన్న అతడు లారీ నుండి దూకడంతో తీవ్ర గాయాలయ్యాయి. దీంతో స్థానికులు అతడిని ఆసుపత్రికి తరలించారు.
CTR: మదనపల్లె-పుంగనూరు రోడ్డులోని వలసపల్లె గ్రామం 150వ మైలు రాయి వద్ద ఈ ఇవాళ రోడ్డు ప్రమాదం జరిగింది. పోలీసుల కథనం మేరకు.. సుమారు 55 ఏళ్ల వయసున్న గుర్తు తెలియని రైతు బైకుపై మదనపల్లె వైపు వెళుతుండగా కుక్క అడ్డు వచ్చింది. బైక్ అదుపు తప్పి పడింది. దీంతో బైకు మీద ఉన్న ఆయన తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు బాధితుడిని స్థానిక జిల్లా ఆస్పత్రికి తరలించారు.
ATP: గుంతకల్లు మండలం కొంగనపల్లి గ్రామ సమీపంలో మంగళవారం ప్రమాదవశాత్తు ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో పాతకొత్తచెరువు గ్రామానికి చెందిన శేషా నందా రెడ్డి అనే యువకుడు మృతి చెందాడు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం గుంతకల్లు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.