కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ(Rahul Gandhi)కి షాకింగ్ న్యూస్ తగిలింది. పరువు నష్టం కేసులో శిక్షపై స్టే విధించాలంటూ రాహుల్ వేసిన పిటిషన్‌పై మధ్యంతర ఉపశమనం కల్పించేందుకు గుజరాత్ హైకోర్టు మంగళవారం నిరాకరించింది. అయితే వేసవి సెలవుల అనంతరం ఆయన పిటిషన్‌పై తుది ఉత్తర్వులు జారీ చేస్తామని హైకోర్టు స్పష్టం చేసింది. 2019లో కర్ణాటకలోని కోలార్‌లో ఎన్నికల ర్యాలీలో చేసిన “దొంగలందరికీ మోదీ అనే పేరు ఎందుకు వచ్చింద...
చికోటీ ప్రవీణ్ కుమార్‌కు థాయ్ కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. రూ.10 వేల జరిమానా విధించడంతో ఫైన్ కట్టినట్టు తెలిసింది.
విధుల్లో భాగంగా పోలీసు వాహనంలో వెళ్తున్న అధికారులకు ప్రమాదవశాత్తు యాక్సిడెంట్(accident) సంభవించింది. ఈ క్రమంలో ఎస్సై, డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందారు. ఈ విషాద ఘటన ములుగు జిల్లా(mulugu district)లో చోటుచేసుకుంది.
దేశంలో గో ఫస్ట్(go first l) విమాన ప్రయాణికులకు బ్యాడ్ న్యూస్. ఎందుకంటే మే 3, 4 తేదీల్లో తక్కువ ధరలో సేవలందించే క్యారియర్ గో ఫస్ట్ ఫ్లైట్స్ సేవలు నిలిపివేయనున్నట్లు సంస్థ ప్రకటించింది. తీవ్రమైన నిధల కొరత కారణంగా రాబోయే రెండు రోజుల పాటు ఈ విమాన సేవల రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. మరోవైపు ఈ కంపెనీ నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (NCLT) ముందు స్వచ్ఛంద దివాలా పరిష్కార ప్రక్రియ కోసం దరఖాస్తును కూడా [&...
సునీల్, శ్రీనివాసరెడ్డి, వెన్నెల కిషోర్, జబర్దస్త్ రాఘవ, వైవా హర్ష, పృథ్వీ, ధనరాజ్ వంటి పలువురు కమెడియన్లు యాక్ట్ చేసిన భువన విజయం మూవీ(Bhuvana Vijayam movie) ట్రైలర్(trailer) ఈరోజు విడుదలైంది. ఈ వీడియో చూస్తే భావోద్వేగాలు, సస్పెన్స్, కామెడీతో కూడిన చిత్రం మాదిరిగా అనిపిస్తుంది. ఈ క్రమంలో ఈ ట్రైలర్ ను మీరు కూడా ఓసారి చూసేయండి మరి.
బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా(Priyanka Chopra) ఎంత హాట్‌గా ఉంటుందో అందరికీ తెలిసిందే. ప్రస్తుతం హాలీవుడ్ స్టాటస్‌ను ఎంజాయ్ చేస్తున్న ఈ బోల్డ్ బ్యూటీ.. రీసెంట్‌గానే సిటాడెల్ అనే వెబ్ సిరీస్‌తో ఆడియెన్స్ ముందుకొచ్చింది. రిచర్డ్ మ్యాడెన్, ప్రియాంక ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సిరీస్ సైన్స్ ఫిక్షన్ స్పై యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కింది. అయితే ఇప్పుడు మెట్ గాలా 2023'లో ప్రియాంక ధరించిన నెక్లెస్ రేట...
అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) మంగళవారం విడుదల చేసిన తాజా ర్యాంకింగ్స్‌లో రోహిత్ శర్మ(Rohit Sharma) నేతృత్వంలోని భారత్ ఆస్ట్రేలియాను అధిగమించి నంబర్ వన్‌గా నిలిచింది. ప్రస్తుతం భారత్ 121 పాయింట్లతో అగ్రస్థానంలో ఉండగా, 116 పాయింట్లతో ఆస్ట్రేలియా రెండో స్థానంలో ఉంది.
హైదరాబాద్(Hyderabad)లో మరో విషాద ఘటన జరిగింది. నాలాలో పడి చిన్నారి మౌనిక మృతిచెందిన ఘటన మరువకముందే మరో ఘటన చోటుచేసుకుంది. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 45లో నీటి గుంతలో పడి ఆరేళ్ల బాలుడు వివేక్(Vivek) చనిపోయాడు.
శరద్ పవార్ రాజీనామాతో ఎన్సీపీలో ఓ కుదుపు వచ్చింది. పార్టీ తదుపరి అధ్యక్షుడి ఎంపిక కోసం కమిటీని ఏర్పాటు చేశామని అజిత్ పవార్ మీడియాకు తెలిపారు.
ప్రయాణిస్తున్న హెలికాప్టర్ గద్ద ఢీకొట్టింది. వేగంగా గద్ద ఢీకొట్టడంతో హెలికాప్టర్ అద్దం పగిలిపోయింది. వెంటనే అత్యవసరంగా హెలికాప్టర్ ను కిందకు దించారు. ఈ సంఘటన కర్ణాటకలో సంచలనంగా మారింది.
తెలంగాణ సీఎం కేసీఆర్‌కు పంట నష్టం శాంపిల్‌ను వాహనంలో వైఎస్ఆర్ టీపీ చీఫ్ షర్మిల పంపించారు.
మహారాష్ట్రలో రెండు వారాలుగా రాజకీయాలు రసకందాయంగా మారాయి. ఇప్పటికే శివసేన పార్టీలో చీలిక తీసుకువచ్చిన బీజేపీ తాజాగా ఎన్సీపీపై (NCP) దృష్టి సారించింది. వచ్చే ఎన్నికల్లో గెలుపు కోసం ఇప్పటి నుంచే అడ్డదారులు తొక్కుతోంది.
ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఈడీ వేగం పెంచింది. వరసగా సప్లిమెంటరీ చార్జిషీట్లు వేస్తోంది. కవిత భర్త అనిల్ పేరును నిన్న చేర్చగా.. ఈ రోజు ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా పేరు చేర్చింది.
జాతిపిత మహాత్మాగాంధీ మనవడు అరుణ్ గాంధీ(89) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన ఈరోజు తుది శ్వాస విడిచారు. మహారాష్ట్రలోని కొల్హాపూర్ లో ఆయన ప్రాణాలు వదిలినట్లు కుటుంబసభ్యులు చెప్పారు.
తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబిత ఇంద్రారెడ్డి(Sabitha Indra Reddy) ఇంటి వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది.