»Mahatma Gandhis Grandson Author Activist Arun Manilal Gandhi Dies At 89
Gandhi’s grandson: గాంధీ మనవడు అరుణ్ గాంధీ కన్నుమూత..!
జాతిపిత మహాత్మాగాంధీ మనవడు అరుణ్ గాంధీ(89) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన ఈరోజు తుది శ్వాస విడిచారు. మహారాష్ట్రలోని కొల్హాపూర్ లో ఆయన ప్రాణాలు వదిలినట్లు కుటుంబసభ్యులు చెప్పారు.
జాతిపిత మహాత్మాగాంధీ మనవడు అరుణ్ గాంధీ(89) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన ఈరోజు తుది శ్వాస విడిచారు. మహారాష్ట్రలోని కొల్హాపూర్ లో ఆయన ప్రాణాలు వదిలినట్లు కుటుంబసభ్యులు చెప్పారు. ఈరోజు కొల్హాపూర్‌లో అరుణ్ గాంధీకి అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు ఆయన కుమారుడు తుషార్ గాంధీ తెలిపారు. మనీలాల్ గాంధీ, సుశీల మషుర్వాలా దంపతులకు 1934, ఏప్రిల్ 14వ తేదీన డర్బన్‌లో అరుణ్ గాంధీ జన్మించారు. మహాత్మా గాంధీ అడుగుజాడల్లో అరుణ్ గాంధీ నడిచారు. సామాజిక కార్యకర్తగా ఎదిగారు. ఆయన మరణం కుటుంబసభ్యులతో పాటు, గాంధీ అభిమానుల్లో విషాదం నింపింది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని అందరూ కోరుకుంటున్నారు.