దేశంలో గో ఫస్ట్(go first l) విమాన ప్రయాణికులకు బ్యాడ్ న్యూస్. ఎందుకంటే మే 3, 4 తేదీల్లో తక్కువ ధరలో సేవలందించే క్యారియర్ గో ఫస్ట్ ఫ్లైట్స్ సేవలు నిలిపివేయనున్నట్లు సంస్థ ప్రకటించింది. తీవ్రమైన నిధల కొరత కారణంగా రాబోయే రెండు రోజుల పాటు ఈ విమాన సేవల రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.
మరోవైపు ఈ కంపెనీ నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (NCLT) ముందు స్వచ్ఛంద దివాలా పరిష్కార ప్రక్రియ కోసం దరఖాస్తును కూడా దాఖలు చేసింది. ఇది దురదృష్టకర నిర్ణయం. కానీ కంపెనీ ప్రయోజనాలను కాపాడటానికి ఇది చేయవలసి వచ్చిందని తెలుస్తోంది.
వాడియా గ్రూప్ యాజమాన్యంలోని ఈ విమానయాన సంస్థ జరుగుతున్న పరిణామాల గురించి ప్రభుత్వానికి తెలియజేసింది. ఈ క్రమంలో ఏవియేషన్ రెగ్యులేటర్ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA)కి వివరణాత్మక నివేదికను కూడా సమర్పించనుంది.