Delhi liquor scamలో కీలక పరిణామం.. ఈడీ చార్జిషీట్లో ఆప్ ఎంపీ రాఘవ్ పేరు
ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఈడీ వేగం పెంచింది. వరసగా సప్లిమెంటరీ చార్జిషీట్లు వేస్తోంది. కవిత భర్త అనిల్ పేరును నిన్న చేర్చగా.. ఈ రోజు ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా పేరు చేర్చింది.
Delhi liquor scam:ఢిల్లీ లిక్కర్ స్కామ్లో (Delhi liquor scam) కీలక పరిణామం చోటుచేసుకుంది. మూడో చార్జీషీట్లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత (kavitha) భర్త అనిల్ (anil) పేరు చేర్చిన సంగతి తెలిసిందే. దాంతోపాటు ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా (Raghav Chadha) పేరును కూడా ఈడీ చేర్చింది. సెకండ్ సప్లిమెంటరీ చార్జిషీట్లో రాఘవ్ పేరును దర్యాప్తు సంస్థ పొందుపర్చింది.
లిక్కర్ స్కామ్లో అరెస్టైన జైలులో ఉన్న ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా (manish sisodia) మాజీ సెక్రటరీ సీ అర్వింద్ చెప్పడంతో రాఘవ్ పేరు చేర్చామని అధికారులు చెబుతున్నారు. సిసోడియా ఇంట్లో జరిగిన భేటీకి రాఘవ్ చద్దా (Raghav Chadha) కూడా హాజరయ్యారని అర్వింద్ ఈడీ అధికారులకు తెలియజేశారు. అతని స్టేట్ మెంట్ మేరకు పేరును చేర్చింది. ఆ రోజు జరిగిన సమావేశానికి పంజాబ్ ఎక్సైజ్ కమిషనర్ వరుణ్ రూజమ్, విజయ్ నాయర్.. ఇతర పంజాబ్ ఎక్సైజ్ అధికారులు హాజరయ్యారని విచారణలో తేలింది.
బాలీవుడ్ నటి పరిణితి చోప్రాతో రాఘవ్ చద్దా లవ్లో ఉన్నారు. వీరికి ఇటీవలే నిశ్చితార్థం జరిగిందని తెలిసింది. అక్టోబర్లో పెళ్లి చేసుకుంటారని విశ్వసనీయ సమాచారం. ఇంతలో లిక్కర్ స్కామ్లో రాఘవ్ పేరు చేర్చడంతో ఒక్కసారిగా కలకలం రేగింది.
లిక్కర్ స్కామ్లో మనీశ్ సిసోడియా నిందితుడు అని ఫస్ట్ సప్లిమెంటరీ చార్జిషీట్లో పేర్కొన్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత వరసగా పెద్ద తలకాయల పేర్లను చేరుస్తున్నారు. ఈ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను పలుమార్లు సుధీర్ఘంగా విచారించారు.
ఇటు హవాలా, ముడుపులు, భూముల కొనుగోళ్ల అంశాన్ని ఈడీ నిన్న ప్రస్తావించింది. రూ.100 కోట్ల ముడుపులకు సంబంధించి తమకు ఆధారాలు లభించాయని చెబుతోంది. లిక్కర్ లాభాలతో అరుణ్ పిళ్లై ద్వారా కవిత (kavitha) భూములు కొనుగోలు చేశారని ఈడీ అధికారులు చెబుతున్నారు. కొనుగోళ్ల లావాదేవీలు పిళ్లై అకౌంట్ నుంచి జరిగాయని తెలిపారు. హైదరాబాద్లో కవిత మూడు ఆస్తులను కొనుగోలు చేశారని అంటున్నారు. రాజకీయ పలుకుబడితో తక్కువ ధరకే భూములు దక్కించుకున్నారని కూడా చెబుతున్నారు.
ఈడీ ఛార్జిషీట్లో కవిత (kavitha) పేరుతోపాటు.. ఆమె భర్త అనిల్ కుమార్ (anil kumar) పేరును కూడా ప్రస్తావించారు. లిక్కర్ లాభాలతో భూములు కొనుగోలు చేసేందుకు కవితకు ఫినిక్స్కు చెందిన శ్రీహరి సహకరించారని ఈడీ చెబుతోంది.