Rains:ఉష్ణమండల తుఫాను (వెస్టర్న్ డిస్టర్బెన్స్) ద్వారా మరో ఐదు రోజులు దేశంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు (rains) కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. 5 రోజుల పాటు వేడి గాలులు ఉండవని.. సాధారణ స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతాయని పేర్కొంది. దేశ వ్యాప్తంగా వర్ష (rains) ప్రభావం ఉంటుందని ప్రకటనలో వివరించింది.
కర్ణాటక (karnataka), కోస్తాంధ్ర (coastandhra), తెలంగాణ (telangana), కేరళ (kerala), తమిళనాడులో (tamilnadu) భారీ నుంచి, అతి భారీ వర్షాలు పడతాయని ఐఎండీ అంచనా వేసింది. అరుణాచల్ ప్రదేశ్ (arunachal pradesh), అసోం, మేఘాలయలో (meghalaya) వారం రోజుల పాటు వర్షాలు ఉంటాయని వెల్లడించింది. పశ్చిమ బెంగాల్ (west bengal), సిక్కిం, ఒడిశాలో (odisha) ఉరుములతో కూడిన వర్షాలు పడతాయని.. పిడుగులు కూడా పడొచ్చని చెప్పింది.
మధ్య భారత్లో కూడా ఉరుములతో కూడిన వర్షాలు పడతాయని పేర్కొంది. ఉత్తరాఖండ్ (uttarakhand), పంజాబ్ (punjab), హర్యానా (haryana), చండీగఢ్, ఢిల్లీ (delhi), హిమాచల్ ప్రదేశ్ (himachal pradesh), ఉత్తరప్రదేశ్లో (uttar pradesh) వడగండ్ల వానలు పడతాయని తెలిపింది. హర్యానా.. పరిసర ప్రాంతాల్లో వర్ష ప్రభావం ఎక్కువే ఉంటుందట. దక్షిణ పాకిస్థాన్ మధ్య మరో వెస్టర్న్ డిస్టర్బెన్స్ కేంద్రీకృతమైందని తెలిపింది.
ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో (telugu states) కురిసిన ఆకాల వర్షంతో అన్నదాత విలవిల లాడుతున్నాడు. చేతికి వచ్చిన పంట నేలరాలడంతో బిక్కు బిక్కుమంటున్నాడు. తెలంగాణ రాష్ట్రంలో పంట నష్టాన్ని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ సారి గాలి దుమారం, వర్షాలతో పంటలకు భారీగా నష్టం వాటిల్లింది. హైదరాబాద్లో (hyderabad) కూడా భారీ వర్షం కురుస్తోంది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అవుతున్నాయి. ఆ ప్రాంతాల్లో నివసించే ప్రజల పరిస్థితి వర్ణణాతీతంగా మారింది.