Delhi liquor scam:ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో (Delhi liquor scam) కీలక పరిణామం చోటుచేసుకుంది. కొత్త అభియోగాలను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ed) నమోదు చేసింది. మూడో ఛార్జిషీట్లో పలు సంచలన విషయాలను పేర్కొంది. సౌత్ గ్రూప్ మెయింటెన్ చేసిన మాగుంట శ్రీనివాసుల రెడ్డి, మాగుంట రాఘవ రెడ్డి, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, శరత్‌పై కొత్త అభియోగాలను నమోదు చేసింది. హవాలా, ముడుపులు, భూముల కొనుగోళ్ల అంశాన్ని ఈడీ ప్రస్తావించింది. రూ.100 కోట్ల ముడుపులకు సంబంధించి తమకు ఆధారాలు లభించాయని చెబుతోంది.
లిక్కర్ లాభాలతో అరుణ్ పిళ్లై ద్వారా కవిత (kavitha) భూములు కొనుగోలు చేశారని ఈడీ అధికారులు చెబుతున్నారు. కొనుగోళ్ల లావాదేవీలు పిళ్లై అకౌంట్ నుంచి జరిగాయని తెలిపారు. హైదరాబాద్‌లో కవిత మూడు ఆస్తులను కొనుగోలు చేశారని అంటున్నారు. రాజకీయ పలుకుబడితో తక్కువ ధరకే భూములు దక్కించుకున్నారని కూడా చెబుతున్నారు.
ఈడీ ఛార్జిషీట్లో కవిత (kavitha) పేరుతోపాటు.. ఆమె భర్త అనిల్ కుమార్ (anil kumar) పేరును కూడా ప్రస్తావించారు. లిక్కర్ లాభాలతో భూములు కొనుగోలు చేసేందుకు కవితకు ఫినిక్స్‌కు చెందిన శ్రీహరి సహకరించారని ఈడీ చెబుతోంది.