»Another Tragedy In Hyderabad Boy Dies After Falling Into Water Hole
Hyderabadలో మరో విషాదం..నీటి గుంతలో పడి బాలుడి మృతి
హైదరాబాద్(Hyderabad)లో మరో విషాద ఘటన జరిగింది. నాలాలో పడి చిన్నారి మౌనిక మృతిచెందిన ఘటన మరువకముందే మరో ఘటన చోటుచేసుకుంది. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 45లో నీటి గుంతలో పడి ఆరేళ్ల బాలుడు వివేక్(Vivek) చనిపోయాడు.
హైదరాబాద్(Hyderabad)లో మరో విషాద ఘటన జరిగింది. నాలాలో పడి చిన్నారి మౌనిక మృతిచెందిన ఘటన మరువకముందే మరో ఘటన చోటుచేసుకుంది. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 45లో నీటి గుంతలో పడి ఆరేళ్ల బాలుడు వివేక్(Vivek) చనిపోయాడు. తన స్నేహితులతో ఆడుకుంటూ ఉండగా ఈ ఘటన జరిగింది. ప్రమాదవశాత్తూ గుంతలో పడిపోయిన బాలుడు నీటిలో మునిగిపోయాడు. అక్కడే ఉన్న స్నేహితులు బాలుడి తల్లిదండ్రులకు చెప్పడంతో వారు వచ్చేలోగా బాలుడు ఊపిరాడక మృతిచెందాడు.
గత కొన్ని రోజులుగా రాష్ట్రం వర్షం పడుతోన్న సంగతి తెలిసిందే. రోడ్డుపై నిలిచే వరద నీటిని తొలగించేందుకు ఆ గుంతను తీసినట్లు సమాచారం. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఆ గుంత పూర్తిగా నిండింది. ఆ గుంతపై ఉన్న కర్ర మీదికి ఎక్కే ప్రయత్నంలోనే పట్టు తప్పి వివేక్ నీటి గుంతలో పడ్డాడు. ఈ విషయాన్ని అక్కడున్న పిల్లలు తెలిపారు.
నీటి గుంతకు దగ్గరలో ఉన్న ఓ షోరూమ్ వద్ద వివేక తల్లిదండ్రులు పనిచేస్తున్నారు. గుంతలో నుంచి వివేక్ (Vivek)ను బయటకు తీయగా అప్పటికే వివేక్ లో చలనం ఆగిపోయింది. ఉదయం కొత్త బట్టల కోసం వివేక్ తన తల్లితో గొడవ పడ్డాడని, పుట్టిన రోజు కొంటామని చెప్పి పనికి వెళ్లినట్లు తల్లిదండ్రులు చెబుతున్నారు. అదే తమ కొడుకు చివరి చూపు అని అనుకోలేదంటూ తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.