»Priyanka At Met Gala 2023 The Necklace Rate Is Shocking
Met Gala 2023:లో ప్రియాంక.. నెక్లెస్ రేట్ తెలిస్తే మైండ్ బ్లాంకే!
బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా(Priyanka Chopra) ఎంత హాట్‌గా ఉంటుందో అందరికీ తెలిసిందే. ప్రస్తుతం హాలీవుడ్ స్టాటస్‌ను ఎంజాయ్ చేస్తున్న ఈ బోల్డ్ బ్యూటీ.. రీసెంట్‌గానే సిటాడెల్ అనే వెబ్ సిరీస్‌తో ఆడియెన్స్ ముందుకొచ్చింది. రిచర్డ్ మ్యాడెన్, ప్రియాంక ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సిరీస్ సైన్స్ ఫిక్షన్ స్పై యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కింది. అయితే ఇప్పుడు మెట్ గాలా 2023'లో ప్రియాంక ధరించిన నెక్లెస్ రేట్ తెలిస్తే మైండ్ బ్లాంక్ అవాల్సిందే.
అమెజాన్ ప్రైమ్ ఒరిజినల్లో సిటాడెల్ ఏప్రిల్ 28న రిలీజ్ అయింది. అయితే ఈ సిరీస్ మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది. అయినా కూడా వరల్డ్ టాప్ సిరీస్‌గా నిలిచింది. ఇదే సిటాడెల్ ఇండియన్ వెర్షన్లో సమంత, వరుణ్ ధావన్ లీడ్ రోల్ ప్లే చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. సోమవారం న్యూయార్క్‌లో జరిగిన మెట్ గాలా 2023 ఈవెంట్లో అలియా భట్( alia bhatt)తో పాటు ప్రియాంక చోప్రా(Priyanka Chopra) కూడా పాల్గోంది.
అలియా భట్ 10 వేల ముత్యాలతో తయారు చేసిన గౌన్ ధరిస్తే.. ప్రియాంక చోప్రా థైస్ షో చేస్తూ హాట్‌గా బ్లాక్ గౌన్‌లో హాట్‌గా కనిపించింది. తన భర్త నిక్‌తో కలిసి స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. నిక్ తెల్ల చొక్కా, నలుపు ప్యాంటు, టై మరియు జాకెట్ ధరించాడు. ఈ జంట రెడ్ కార్పెట్ మీద పోజులిచ్చి ఒకరినొకరు చూసుకుని నవ్వుకున్నారు. అయితే ఈ హాట్ జోడినే కాదు.. ప్రియాంక మెడలో ఉన్న డైమండ్ నెక్లెస్(diamond necklace) ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
ప్రియాంక(Priyanka Chopra) ధరించింది 11.6 క్యారెట్ల డైమండ్ నెక్లెస్ అని తెలుస్తోంది. దీని ధర అక్షరాలా 200 కోట్లకు పైగా ఉంటుందని అంటున్నారు. ఇది తెలిసిన తర్వాత నెటిజన్స్ మైండ్ బ్లాంక్ అవుతోంది. ఈ డైమండ్‌ని వేలం వేసి అమ్ముతారట. వేలంలో 250 కోట్లకు పైనే పలుకుతుందని అంటున్నారు. ప్రస్తుతం ‘మెట్ గాలా 2023’లో ప్రియాంక, నిక్ ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.