»Shahrukhs Son Aryan Khan As Director This Is The Title
Shahrukhs son: డైరెక్టర్‌గా షారుఖ్ కొడుకు.. టైటిల్ ఇదే!
బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్(Shahrukh) గురించి అందరికీ తెలిసిందే. రీసెంట్‌గానే పఠాన్ సినిమాతో సాలిడ్ బౌన్స్ బ్యాక్ అయ్యాడు షారుఖ్. ఏకంగా వెయ్యి కోట్లు రాబట్టి.. బాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర సెన్సేషన్ క్రియేట్ చేశాడు. ప్రస్తుతం రాజ్ కుమార్ హిరాణీతో 'డంకీ' అనే సినిమా చేస్తున్నాడు. ఈ ప్రాజెక్ట్ పై భారీ అంచనాలున్నాయి. ఇక షారుఖ్ కొడుకు ఆర్యన్ ఖాన్(aryan khan) గురించి తరచుగా ఏదో ఒక వార్త వింటూనే ఉన్నాము. తాజాగా మరోసారి వార్తల్లో నిలిచాడు షారుఖ్ పుత్రరత్నం.
ఆ మధ్య ముంబై డ్రగ్స్ కేసులో ఆర్యన్ ఖాన్(aryan khan) అరెస్ట్ కావడం సంచలనం రేపింది. ఆ ఘటనతో ఆర్యన్‌కు మరింత పాపులారిటీ వచ్చింది. అయితే తండ్రిలాగే కొడుకు కూడా హీరో అవుతాడని అనుకున్నారు బాద్షా ఫ్యాన్స్. కానీ ఆర్యన్ మాత్రం హీరోగా కాకుండా.. డైరెక్టర్‌గా మెగా ఫోన్ పడుతున్నాడు.
తండ్రిలా కెమెరా ముందు కాకుండా.. కెమెరా వెనుక కెప్టెన్ అఫ్ ది షిప్‌గా ఉండాలనుకుంటున్నాడు. ఇప్పటికే తండ్రి నటించిన ఓ యాడ్‌కు దర్శకత్వం వహించిన ఆర్యన్.. ఇప్పుడు ఓ వెబ్ సిరీస్‌ను తెరకెక్కిస్తున్నాడు. దీన్ని షారుఖ్(Shahrukh) సొంత నిర్మాణ సంస్థ రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్ నిర్మిస్తోంది. ఈ వెబ్ సిరీస్‌కు ‘స్టార్డమ్’ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ప్రస్తుతం ఈ వెబ్ సిరీస్ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది.
ఇప్పటికే ఆర్యన్ ఖాన్ అమెరికా(USA)లో ఫిల్మ్ మేకింగ్ కోర్సు పూర్తి చేసుకుని వచ్చారు. దాంతో ఈ వెబ్ సిరీస్ ఇప్పటి నుంచే ఇంట్రెస్టింగ్గా మారింది. మొత్తంగా ఈ వెబ్ సిరీస్ ఆరు ఎపిసోడ్లుగా ఉంటుందని తెలుస్తోంది. ఈ సిరీస్ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుందని సమాచారం. అయితే ఒక సూపర్ స్టార్ కొడుకు హీరోగా కాకుండా.. డైరెక్టర్‌గా ఎలా రాణిస్తాడనేది.. మరింత ఆసక్తికరంగా మారింది. మరి డైరెక్టర్‌గా సత్తా చాటిన తర్వాత.. ఆర్యన్ ఖాన్ హీరోగా ట్రై చేస్తాడేమో చూడాలి.