నందమూరి నటసింహం బాలకృష్ణ, బోయపాటి శ్రీనుది డెడ్లీ కాంబినేషన్. ఈ ఇద్దరు చేసిన సినిమాలు ఇండస్ట్రీ హిట్స్‌గా నిలిచాయి. దాంతో మరోసారి ఈ కాంబినేషన్ రిపీట్ కాబోతోంది. అది కూడా సీక్వెల్ కావడంతో సంచనాలతో పాటు అంచనాలు పెరిగిపోతున్నాయి. తాజాగా అఖండ2 కథ కూడా లీక్ అయిపోయిందనే టాక్ నడుస్తోంది. మరి అఖండ 2 అసలు కథేంటి!?
అప్పటి వరకు బాలయ్య(Balakrishna)ను ఎవరు చూడని యాంగిల్లో చూపించి.. సింహా సినిమాతో భారీ విజయాన్ని ఇచ్చాడు బోయపాటి. ఆ తర్వాత లెజెండ్ సినిమాతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకున్నారు బాలయ్య, బోయపాటి. ఇక హ్యాట్రిక్‌తో మామూలు హిట్ కొట్టలేదు. కరోనా సమయంలో జనాలు ఇక థియేటర్లోకి రారు.. అనే డైలామాలో ఉన్న సమయంలో.. అఖండతో అఖండ విజయాన్ని అందుకున్నారు. డివోషనల్ టచ్ ఇచ్చి గూస్ బంప్స్ తెప్పించారు. బోయపాటి(Boyapati) మార్క్ యాక్షన్‌కు తోడు దైవత్వాన్ని పవర్ ఫుల్‌గా చూపించడంతో.. అఖండ(Akhanda) బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. దాంతో అప్పుడే అఖండకు సీక్వెల్ చేయాలని ఫిక్స్ అయిపోయారు.
ప్రస్తుతం బాలకృష్ణ(Balakrishna) అనిల్ రావిపుడితో 108 సినిమా చేస్తున్నాడు. బోయపాటి(Boyapati), రామ్‌తో ఓ పాన్ ఇండియా సినిమా చేస్తున్నాడు. దీని తర్వాత అఖండ 2 సెట్స్ పైకి వెళ్లే ఛాన్స్ ఉందంటున్నారు. ఈ క్రమంలో సోషల్ మీడియాలో అఖండ2 కథను అల్లేస్తున్నారు. ఓ స్వార్థ పరుడి చేతిలో పడి నాశనం అవుతున్న ప్రజలను, దేవాలయాలను కాపాడే విధంగా ఈ సినిమా ఉంటుందట. ముఖ్యంగా తిరుమలేశుని ప్రతిష్టను తగ్గించే కార్యక్రమాలు చేసే వ్యక్తులను హీరో అంతం చేస్తాడనేదే అఖండ2(Akhanda2) కాన్సెప్ట్ అని ప్రచారం జరుగుతోంది. దేవాలయాల పై జరిగే దాడులు.. వాటిని ఎలా అరికట్టాలి? లాంటి అంశాలను అఖండ 2లో చూపించబోతున్నారట. ఇందులో నిజమెంతో తెలియదు గానీ.. ఈ సీక్వెల్ మాత్రం పక్క పొలిటికల్ టార్గెట్‌గా రాబోతోందనే టాక్ నడస్తోంది. జూన్ 10 బాలయ్య పుట్టినరోజున సందర్భంగా.. ఈ సినిమాను అఫిషీయల్‌గా ప్రకటించే అవకాశం ఉందంటున్నారు.