పోలీసులు పార్లమెంట్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన బారికేడ్లను తొలగించుకుని ముందకు సాగేందుకు రెజ్లర్లు ప్రయత్నించారు. వారిని పోలీసులు అడ్డుకున్నారు. ఆ సమయంలో తోపులాట జరిగింది. ప్రస్తుతం దానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్(Video Viral) అవుతున్నాయి.
అంబటి రాయుడు ఐపీఎల్ కు రిటైర్మెంట్(Ambati Rayudu Retirement) ప్రకటించాడు. ఈ ఐపీఎల్ కెరీర్ లో అంబటి రాయుడుకు ఇది చివరి మ్యాచ్.
రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో మణిపూర్(Manipur) పోలీసులకు చెందిన కమాండో(commandos)లకు, దుండగులకు మధ్య కాల్పులు జరుగుతున్నాయి. గత 8 గంటలుగా ఇరువర్గాల నుంచి భీకర కాల్పులు జరుగుతున్నాయి.
బాలిక 800 గ్రాములున్న మగ శిశువుకు జన్మనిచ్చింది. నెలలు నిండకుండానే ప్రసవం కావడంతో బిడ్డ పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్(MK Stalin) జపాన్(Japan) పర్యటనలో ఉన్నారు. ఆదివారం జపాన్‌లోని ఒసాకా(osaka) నుంచి రాజధాని టోక్యో(tokyo)కు దాదాపు 500 కిలోమీటర్లు ప్రయాణించారు.
యువ హీరో శర్వానంద్ కారు ప్రమాదానికి గురయ్యింది. జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 45లో ఆయన కారు ఓ డివైడర్‌ను ఢీ కొంది. దీంతో ఆయనకు స్వల్ప గాయాలు అయ్యాయి.
కొత్త పార్లమెంట్ భవనంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పూజలు చేశారు. పూజలో మోడీతోపాటు స్పీకర్ ఓం బిర్లా కూడా పాల్గొన్నారు.
రిక్టర్ స్కేల్‌పై 3.5, 3.3 తీవ్రతతో రెండు బలమైన భూకంపాలు మహారాష్ట్రలోని పాల్ఘర్‌లో చోటుచేసుకున్నట్లు సిస్మోలజీ అధికారులు తెలిపారు.
మహానాడు(Mahanadu)లో చంద్రబాబు(Nara Chandrababu Naidu) మాట్లాడుతూ..ప్రజలతో అనుసంధానం కావాలని టీడీపీ శ్రేణులకు పిలుపునిచ్చారు. యువగళం పాదయాత్ర విజయవంతంగా సాగుతోందన్నారు. జరగబోయే కురుక్షేత్ర యుద్ధంలో కౌరవులను వధించి విజయం సాధించాలన్నారు.
కొన్ని ప్రాంతాల్లో వర్షాలు పడినా మరికొన్ని జిల్లాల్లో మాత్రం ఎండ తీవ్రత ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. ఆదివారం 73 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని హెచ్చరించింది.
ఒమిక్రాన్ వేరియంట్ తర్వాత కరోనా బాధితుల్లో ప్రతి పదిమందిలో ఒకరు లాంగ్ కొవిడ్ లక్షణాలతో బాధపడుతున్నట్టు అమెరికా శాస్త్రవేత్తల పరిశోధనలో వెల్లడైంది.
జీవనం కోసం ఇక్కడి నుంచి చాలా మంది భారతీయులు విదేశాలకు వెళ్లి సెటిల్ అవుతూ ఉంటారు. అక్కడకు వెళ్లినా, ఇక్కడి పండగలను మాత్రం చాలా మంది మిస్ అవుతూ ఉంటారు. మనకు అయితే, ఇక్కడ పండగలకు అఫీషియల్ గా హాలీడే ఉంటుంది. కానీ, అక్కడివారు పండగైనా ఆఫీసులకు వెళ్లాల్సిందే, పనులు చేయాల్సిందే. అయితే, ఇక నుంచి ఆ బాధ లేదు. అమెరికాలో ని భారతీయులకు అక్కడి ప్రభుత్వం శుభవార్త తెలియజేసింది. ఇక నుంచి అక్కడి వారికి కూడా దీప...
మధ్యాహ్న భోజనంలో చచ్చిన పాము రావడంతో 100 మంది విద్యార్థులు ఆస్పత్రిపాలయ్యారు. ప్రస్తుతం ఈ ఘటన కలకలం రేపుతోంది.
ఏప్రిల్ 30వ తేదిన ఏఈ, జేఎల్ఎం ఉద్యోగాల నియామకాలకు రాత పరీక్షలు జరిగాయి. పరీక్షలు జరిగిన నెల రోజుల్లో ఫలితాలను ప్రభుత్వం విడుదల చేసింది.
బీజేపీ అధికారంలో లేని రాష్ట్రాలను కేంద్ర ప్రభుత్వం టార్గెట్ చేసిందని తెలంగాణ సీఎం కేసీఆర్ ఆరోపించారు.