తెలంగాణలో నిర్వహించిన టీఎస్ఎస్పీడీసీఎల్ ఏఈ, జేఎల్ఎం(TSSPDCL AE, JLM) పరీక్షా ఫలితాలు రిలీజ్ అయ్యాయి. ఏప్రిల్ 30వ తేదిన ఏఈ, జేఎల్ఎం ఉద్యోగాల నియామకాలకు రాత పరీక్షలు జరిగాయి. పరీక్షలు జరిగిన నెల రోజుల్లో ఫలితాలను ప్రభుత్వం విడుదల చేసింది. టీఎస్ఎస్పీడీసీఎల్ ఏఈ, జేఎల్ఎం పరీక్షా ఫలితాల కోసం tssouthernpower.cgg.gov.in అనే వెబ్సైట్ను లాగిన్ అయ్యి రిజల్ట్స్ చూసుకోవచ్చు.
మరోవైపు తెలంగాణ(Telangana)లో ఇంజనీరింగ్ ఎంట్రన్స్ కౌన్సిలింగ్ షెడ్యూల్ విడుదలైంది. జూన్ 26 నుంచి ఆగస్టు 9 వరకూ మూడు విడతల్లో ఈ ప్రవేశాల ప్రక్రియ సాగనుంది. జూన్ 26 నుంచి ఆన్లైన్ కౌన్సిలింగ్ ఫీజు చెల్లింపు, జూన్ 28 నుంచి జులై 26 వరకూ ధ్రువపత్రాల పరిశీలన, జులై 8 వరకూ వెబ్ ఆప్షన్ల నమోదు ఉండనుంది. జులై 12 నుంచి మొదటి విడత ఇంజనీరింగ్ సీట్ల కేటాయింపు జరగనుంది.