మహారాష్ట్ర(Maharastra)లో ఒకే రోజు రెండు సార్లు భూకంపాలు(Earthquake) చోటుచేసుకున్నాయి. రిక్టర్ స్కేల్‌పై 3.5, 3.3 తీవ్రతతో రెండు బలమైన భూకంపాలు మహారాష్ట్రలోని పాల్ఘర్లో చోటుచేసుకున్నట్లు సిస్మోలజీ అధికారులు తెలిపారు. శనివారం సాయంత్రం వరుసగా 5:15, 5:28 గంటలకు ఈ భూకంపాలు సంభవించాయని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ వెల్లడించింది. అయితే ఈ భూకంపాల(Earthquakes) వల్ల ఎటువంటి నష్టం జరిగిందో ఇప్పటి వరకూ తెలియరాలేదు.