బీహార్లో దారుణం జరిగింది. ఓ ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనంలో చచ్చిన పాము(Snake) బయటపడింది. దీంతో పాఠశాలలో భోజనం తిన్న 100 మంది విద్యార్థులు(Students) ఆస్పత్రి పాలయ్యారు. ప్రస్తుతం ఈ ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. అరారియా జిల్లాలో జోగ్బాని నగర్ పరిషత్ ప్రాంతంతో అమౌనా మిడిల్ స్కూల్ ఉంది. శనివారం విద్యార్థులకు భోజనం వడ్డిస్తుండగా చనిపోయిన పాము వచ్చింది. ఈ విషయాన్ని ఓ విద్యార్థి గమనించి పాము ఉందంటూ అరిచాడు.
అయితే అప్పటికే ఆ భోజనాన్ని(Mid Day meals) తిన్న 100 మంది విద్యార్థులకు కడుపులో అసౌకర్యంగా అనిపించింది. దీంతో పాఠశాల సిబ్బంది ఆ విద్యార్థులను స్థానిక ఆస్పత్రి(Hospital)కి తరలించి చికిత్స అందించారు. ప్రస్తుతం భోజనం తిన్న విద్యార్థులంతా సురక్షితంగా ఉన్నట్లు పాఠశాల ఉపాధ్యాయులు, జిల్లా విద్యాశాఖాధికారి రాజ్ కుమార్(Raj Kumar) వెల్లడించారు.
ఆస్పత్రిపాలైన విద్యార్థుల తల్లిదండ్రులను జిల్లా విద్యాధికారి రాజ్ కుమార్ కలిశారు. ఈ ఘటనపై విచారణ చేసి తప్పు చేసిన వారిని వదిలిపెట్టమని తెలిపారు. పాఠశాలకు ఓ ఎన్జీఓ(NGO) మధ్యాహ్న భోజన(Mid Day meals) పదార్థాలను సరఫరా చేస్తోందని, అందులో వారి తప్పు ఉన్నట్లు తేలితే వదిలిపెట్టేది లేన్నారు. స్కూల్ టీచర్లు కూడా ఈ విషయంలో ఎన్జీవోపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం విద్యార్థులను సురక్షితంగా ఇంటికి తరలించారు.