»Us Lawmaker Introduces Bill To Declare Diwali A Federal Holiday
America: అమెరికాలో భారతీయులకు శుభవార్త.. దీపావళికి అఫీషియల్ హాలీడే..!
జీవనం కోసం ఇక్కడి నుంచి చాలా మంది భారతీయులు విదేశాలకు వెళ్లి సెటిల్ అవుతూ ఉంటారు. అక్కడకు వెళ్లినా, ఇక్కడి పండగలను మాత్రం చాలా మంది మిస్ అవుతూ ఉంటారు. మనకు అయితే, ఇక్కడ పండగలకు అఫీషియల్ గా హాలీడే ఉంటుంది. కానీ, అక్కడివారు పండగైనా ఆఫీసులకు వెళ్లాల్సిందే, పనులు చేయాల్సిందే. అయితే, ఇక నుంచి ఆ బాధ లేదు. అమెరికాలో ని భారతీయులకు అక్కడి ప్రభుత్వం శుభవార్త తెలియజేసింది. ఇక నుంచి అక్కడి వారికి కూడా దీపావళి సెలవు రోజు కానుంది.
అమెరికాలో దీపావళిని దేశవ్యాప్త సెలవుగా ప్రకటించేందుకు కాంగ్రెస్ సభ్యురాలు గ్రేస్ మేంగ్ ప్రతినిధుల సభలో ‘దివాళి డే యాక్ట్’ పేరిట తాజాగా ఓ బిల్లును ప్రవేశపెట్టారు. దీనిపై అమెరికాలో సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తున్నాయి. ”ప్రపంచంలో కొన్ని లక్షల మందికి దీపావళి ఎంతో ముఖ్యమైన పర్వదినం. అమెరికాలోనూ కొన్ని వేల కుటుంబాలు ఈ పండుగ జరుపుకుంటాయి. ఈ రోజుకున్న ప్రాముఖ్యతపై అమెరికన్లలో అవగాహన పెంచేందుకు తొలి అడుగుగా ఈ బిల్లును సిద్ధంగా చేశాను. అని మేంగ్ మీడియా సమావేశంలో తెలిపారు. ఈ బిల్లుపై న్యూయార్క్ అసెంబ్లీ సభ్యురాలు జెన్నీఫర్ రాజ్‌కుమార్ సంతోషం వ్యక్తం చేశారు.
”దీపావళి ప్రాముఖ్యాన్ని, దక్షిణాసియా వారిని గుర్తిస్తూ ఓ రాష్ట్రం మొత్తం ఈ ఏడాది ఏకతాటిపైకి రావడం మనం చూశాం. ఈ స్ఫూర్తిని కాంగ్రెస్ సభ్యురాలు మెంగ్ జాతీయ స్థాయికి తీసుకెళ్లారు. దీపావళిని జాతీయ సెలవుదినంగా ప్రకటించేందుకు చారిత్రక బిల్లును ప్రవేశపెట్టారు” అని కొనియాడారు. ఈ క్రమంలో న్యూయార్క్ స్టేట్ సెనేటర్ జెరెమీ కూనీ కూడా మెంగ్‌ను ప్రశంసించారు. ఈ బిల్లును అమెరికా చట్టసభలు ఆమోదిస్తే అధ్యక్షుడు ఆమోదముద్ర వేస్తారు. దీంతో, దీపావళికి అమెరికాలో 12వ దేశవ్యాప్త హాలిడేగా గుర్తింపు దక్కుతుంది. ఈ బిల్లుకు అమెరికా కాంగ్రెస్ ఆమోదం కోసం గట్టి కృషి చేస్తానని బిల్లును ప్రతిపాదించిన గ్రేస్ మెంగ్ పేర్కొన్నారు.