Two-year-old sent prison because parents owned Bible', US report
Kim Jong Un: ఉత్తరకొరియా కిమ్ జాంగ్ ఉన్ (Kim Jong Un) అరాచక రాజ్యం కొనసాగుతోంది. ఇక్కడ క్రైస్తవ మతంపై నిషేధం ఉంటుంది. వారి పవిత్ర గ్రంథం బైబిల్తో సహా దొరికితే ఇక అంతే సంగతులు.. ఇటీవల ఓ జంట కనిపించగా కఠిన చట్టం అమలు చేశారు. చిన్నారిని కూడా జైలుకు తరలించి తన కఠిన్యాన్ని చాటుకున్నారు.
ఉత్తర కొరియాలో క్రైస్తవ మతం అవలంబించేవారి పట్ల కిమ్ (Kim) సర్కార్ కఠిన చర్యలు తీసుకుంటుంది. వారి కుటుంబ సభ్యులను జైలు వంటి శిబిరంలో నిర్బంధిస్తున్నారు. వారు అక్కడే జీవిత ఖైదుగా ఉండాల్సిందే. క్రైస్తవం, ఇతర మతాలకు చెందిన 70 వేల మంది ఉన్నారు. ఇటీవల చిన్నారితో పేరంట్స్ (Parents) కనిపించారు. వారి వద్ద బైబిల్ కనిపించింది. ఇంకేముంది దంపతులకు కిమ్ సర్కార్ ఉరి శిక్ష వేసింది. రెండేళ్ల చిన్నారిపై కాస్త దయ చూపింది. అంటే విడుదల చేయలేదు.. కానీ నిర్బంధ శిబిరానికి పంపించింది. ఈ విషయాన్ని అమెరికా విదేశాంగ శాఖ ఓ నివేదికలో తెలిపింది.
ఉత్తర కొరియాలో (North korea) 70 శాతం మంది నాస్తికులు ఉన్నారు. 11 శాతం మంది మాత్రమే బౌద్ధమతం స్వీకరించారు. 1.7 శాతం ఇతర మతాల వారు ఉన్నారు. 16.5 శాతం మంది ఏ మతానికి చెందినవారో తెలియదు. 2015 నాటి గణాంకాల ఆధారంగా అక్కడ ఉంటోన్న ప్రజల మతానికి సంబంధించిన విషయం తెలిసింది.