Weather Update: ఏపీ ప్రజలకు అలర్ట్..పిడుగులతో కూడిన వర్షాలు
కొన్ని ప్రాంతాల్లో వర్షాలు పడినా మరికొన్ని జిల్లాల్లో మాత్రం ఎండ తీవ్రత ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. ఆదివారం 73 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని హెచ్చరించింది.
ఏపీ ప్రజలకు వాతావరణ శాఖ(Ap Weather Department) హెచ్చరికలు జారీ చేసింది. ద్రోణి ప్రభావంతో ఆదివారం పలు జిల్లాల్లో పిడుగుల(Thunderstroms)తో కూడిన భారీ వర్షాలు(Heavy Rain) కురిసే అవకాశం ఉందని ప్రకటించింది. అల్లూరి సీతారామరాజు జిల్లా, చిత్తూరు, అన్నమయ్య, వైఎస్ఆర్, శ్రీ సత్యసాయి, అనంతపురం జిల్లాల్లో పిడుగులు పడే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వెల్లడించింది. ఏపీ వ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటించింది.
వర్షం(Rain) పడే సమయంలో చెట్ల కింద ఎవ్వరూ నిలబడవద్దని, బహిరంగ ప్రదేశాల్లో గుమికూడి ఉండొద్దని వాతావరణ శాఖ(Ap Weather Department) హెచ్చరించింది. సముద్రం, చెరువులు, కొలనులు, కాలవల వద్ద ఉంటే వెంటనే దూరంగా వెళ్లాలని సూచించింది. అలాగే రేకు, లోహం కలిగిన నిర్మాణాలకు దూరంగా ఉండాలని వాతావరణశాఖ సూచించింది.
మరోవైపు ద్రోణి ప్రభావంతో అల్లూరి, చిత్తూరు, అన్నమయ్య, వైఎస్ఆర్, శ్రీ సత్యసాయి, అనంతపురం జిల్లాలో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది.
పిడుగుపాటు వర్షాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.
చెట్ల కింద నిలబడరాదు
— Andhra Pradesh State Disaster Management Authority (@APSDMA) May 27, 2023
కొన్ని ప్రాంతాల్లో వర్షాలు పడినా మరికొన్ని జిల్లాల్లో మాత్రం ఎండ తీవ్రత ఉంటుందని వాతావరణ శాఖ(Ap Weather Department) తెలిపింది. ఆదివారం 73 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని హెచ్చరించింది. అల్లూరి జిల్లాలో 3, బాపట్ల 1, తూర్పుగోదావరి 11, ఏలూరు 5, గుంటూరు 15, కాకినాడ 8, కృష్ణా 9, ఎన్టీఆర్ 10, పల్నాడు 5, మన్యం4, వైయస్సార్ జిల్లాలోని 2 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ ప్రకటించింది.