»Tension In Delhi Wrestlers Rushed Towards Parliament
Wrestlers Protest: ఢిల్లీలో ఉద్రిక్తత..పార్లమెంట్ వైపు దూసుకెళ్లిన రెజ్లర్లు అరెస్ట్
పోలీసులు పార్లమెంట్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన బారికేడ్లను తొలగించుకుని ముందకు సాగేందుకు రెజ్లర్లు ప్రయత్నించారు. వారిని పోలీసులు అడ్డుకున్నారు. ఆ సమయంలో తోపులాట జరిగింది. ప్రస్తుతం దానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్(Video Viral) అవుతున్నాయి.
లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న బ్రిజ్ భూషణ్ పై చర్యలు తీసుకోవాలని రెజ్లర్లు నిరసన(Wrestlers Protest) తెలుపుతున్న సంగతి తెలిసిందే. తాజాగా రెజ్లర్లు(Wrestlers) చేపడుతున్న ఆందోళనలు తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీశాయి. పార్లమెంట్ నూతన భవనం ప్రారంభోత్సవం సందర్భంగా అటువైపు రెజ్లర్లు మార్చ్ చేపట్టారు. అయితే పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఆందోళనకారులను పోలీసులు నిర్భంధించే ప్రయత్నం చేయగా తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.
రెజ్లర్లకు, పోలీసులకు మధ్య జరిగిన తోపులాట:
https://twitter.com/i/status/1662729269532065792
బీజేపీ ఎంపీ, భారత రెజ్లింగ్ సమాఖ్య చీఫ్ బ్రిజ్ భూషణ్(Brij Bhushan) పలువురు అథ్లెట్లపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని, ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ నెల రోజుల నుంచి రెజ్లర్లు దీక్ష చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రముఖ రెజ్లర్లు వినేశ్ ఫొగాట్, సాక్షి మాలిక్, బజ్ రంగ్ పునియా తదితరులు ఆందోళన(Wrestlers Protest) చేస్తున్నారు. ఆదివారం మహిళా సమ్మాన్ మహాపంచాయత్ నిర్వహించనున్న తరుణంలో రెజ్లర్ల ఆందోళనలు తీవ్రమయ్యాయి.
పోలీసులు పార్లమెంట్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన బారికేడ్లను తొలగించుకుని ముందకు సాగేందుకు రెజ్లర్లు ప్రయత్నించారు. వారిని పోలీసులు అడ్డుకున్నారు. ఆ సమయంలో తోపులాట జరిగింది. ప్రస్తుతం దానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్(Video Viral) అవుతున్నాయి. నిరసనకారులను నిర్భంధించి బస్సుల్లోకి ఎక్కించినట్లు కమిషనర్ దీపేంద్ర పాఠక్ తెలిపారు. అథ్లెట్లు శాంతి భద్రతలను ఉల్లంఘించినందుకు గాను విచారణ చేపట్టి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు.
इस IPS अधिकारी का एक्शन देखिए… ऐसी हिम्मत इसने बृज भूषण सिंह को पकड़ने में दिखा सकता है ये अफ़सर ? ये तो ऐसे लग रहा है जैसे मौक़ा मिले तो जान से ही मार दें। So Shameful !!! #WrestlersProtestpic.twitter.com/rfi4Z5TOFG