»Chandrababu Was Sworn In As The National President Of Tdp For The 14th Time
TDP: 14వ సారి టీడీపీ జాతీయ అధ్యక్షుడిగా చంద్రబాబు ప్రమాణం
మహానాడు(Mahanadu)లో చంద్రబాబు(Nara Chandrababu Naidu) మాట్లాడుతూ..ప్రజలతో అనుసంధానం కావాలని టీడీపీ శ్రేణులకు పిలుపునిచ్చారు. యువగళం పాదయాత్ర విజయవంతంగా సాగుతోందన్నారు. జరగబోయే కురుక్షేత్ర యుద్ధంలో కౌరవులను వధించి విజయం సాధించాలన్నారు.
టీడీపీ(TDP) జాతీయ అధ్యక్షుడిగా నారా చంద్రబాబు నాయుడు(Nara Chandrababu Naidu) 14వ సారి ఎన్నికయ్యారు. మహానాడు(Mahanadu) తొలి రోజు చివర్లో మాజీ మంత్రి కాలువ శ్రీనివాసులు ఎన్నికల ఫలితాలను విడుదల చేశారు. నారా చంద్రబాబు నాయుడు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు కాలువ శ్రీనివాసులు ప్రకటించారు. దీంతో మహానాడు సభా ప్రాంగణం చప్పట్లతో దద్దరిల్లింది. అనంతరం చంద్రబాబు చేత కాలువ శ్రీనివాసులు ప్రమాణ స్వీకారం చేయించారు.
‘మహానాడు’లో చంద్రబాబు మాట్లాడిన వీడియో:
తెలుగుదేశం అధికారంలోకి వచ్చాక పేదలను సంపన్నులను చేసే పథకం పెడతామంటూ అధినేత @ncbn గారు ప్రవేశపెట్టిన తీర్మానానికి మహానాడు ఏకగ్రీవ ఆమోదం తెలిపింది. జనాభా దామాషా ప్రకారం అన్ని వర్గాలకు న్యాయం చేస్తామని చంద్రబాబు గారు మహానాడు వేదికగా హామీ ఇచ్చారు.#Mahanadu2023pic.twitter.com/W6K29XGpmJ
మధ్యాహ్నం 3 గంటల నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కాగా సాయంత్రం 4 గంటలకు నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ పూర్తయ్యింది. కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు ఆధ్వర్యంలో కాలువ శ్రీనివాసులు, నక్కా ఆనంద్ బాబు, రావుల చంద్రశేఖర్ రెడ్డి, గుమ్మడి సంధ్యారాణి, ఫరూక్ ఎన్నికల పర్యవేక్షకులుగా వ్యవహరించారు. మొత్తం 11 మంది చంద్రబాబు(Nara Chandrababu Naidu) అభ్యర్థిత్వాన్ని బలపరిచినట్లు సమాచారం. రెండు సంవత్సరాలకు ఒకసారి పార్టీ అధ్యక్షుడిని ఎన్నుకునే ప్రక్రియలో భాగంగా నేడు ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే.
మహానాడు(Mahanadu)లో చంద్రబాబు(Nara Chandrababu Naidu) మాట్లాడుతూ..ప్రజలతో అనుసంధానం కావాలని టీడీపీ శ్రేణులకు పిలుపునిచ్చారు. యువగళం పాదయాత్ర విజయవంతంగా సాగుతోందన్నారు. జరగబోయే కురుక్షేత్ర యుద్ధంలో కౌరవులను వధించి విజయం సాధించాలన్నారు. భావితరాల భవిష్యత్తు కోసం బాధ్యతగా ముందుకు నడవాలని పిలుపునిచ్చారు. టీడీపీ(TDP)ని ముందుకు నడిపిస్తున్న పార్టీ శ్రేణులకు ధన్యవాదాలు తెలిపారు.