12 ఏళ్ల బాలిక(Girl) మగబిడ్డకు జన్మనిచ్చిన ఘటన పంజాబ్(Punjab) రాష్ట్రంలోని అమృత్సర్ జిల్లాలో చోటుచేసుకుంది. తీవ్ర కడుపునొప్పితో బాధపడుతున్న బాలిక గురునానక్ దేవ్ ఆస్పత్రికి తన తండ్రితో పాటు వచ్చింది. వైద్యులు ఆమెకు పరీక్షలు చేయగా ఆ బాలిక గర్భవతి(Pregnent) అని తేల్చారు. తీవ్ర కడుపునొప్పితో బాధపడటంతో ఆ బాలికకు ప్రసవం చేశారు. బాలిక 800 గ్రాములున్న మగ శిశువుకు జన్మనిచ్చింది. నెలలు నిండకుండానే ప్రసవం కావడంతో బిడ్డ పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
వైద్యుల సమాచారం మేరకు పోలీసులు(Police) బాలిక తండ్రిని విచారించారు. ఈ ఘటనపై పోలీసులు ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. బాలిక తండ్రిని ప్రశ్నించగా..గత ఏడు నెలల నుంచి తన కూతురు కడుపునొప్పితో బాధపడుతున్నట్లు తెలిపారు. కడుపు నొప్పి వచ్చిన ప్రతిసారీ మందులు తెచ్చి ఇచ్చేవాడినన్నారు. తన భార్య ఇల్లు విడిచి వెళ్లిపోయిందని, అప్పటి నుంచి తాను తన కూతురు మాత్రమే ఉన్నట్లు తెలిపాడు. తన కూతురు గర్భవతి(Pregnent) అయినట్లు తనకు తెలియదన్నాడు.
బాలిక(Girl)ను విచారించగా..ఏడు నెలలకు ముందు తాను బహిర్భూమికి వెళ్లినప్పుడు ఓ వ్యక్తి తనపై అత్యాచారం చేసినట్లు తెలిపింది. ఆ విషయం గురించి ఎవ్వరికైనా చెబితే చంపేస్తానని నిందితుడు బెదిరించినట్లుగా చెప్పింది. నిందితుడి పేరు తనకు తెలియదని, తన ముఖం చూస్తే గుర్తుపడతానని బాలిక పోలీసులుకు తెలిపింది. కేసు నమోదు చేసి నిందితుడి కోసం గాలిస్తున్నట్లు సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ రాజ్‌పాల్ సింగ్ సంధు వెల్లడించారు.