మెక్డొనాల్డ్స్(mcdonalds) ఇండియా (వెస్ట్, సౌత్) బ్రాండ్ అంబాసిడర్గా టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్(jrntr) ఎంపికయ్యారు. ఇప్పటికే పలు యాడ్స్ చేస్తూ సినిమాలతో బిజీగా ఉన్న యంగ్ టైగర్ తాజాగా ఈ యాడ్ ప్రకటన కోసం సంతకం చేశారు.
జూనియర్ ఎన్టీఆర్ (jrntr)పేరు ప్రస్తుతం దేశ వ్యాప్తంగా మార్మోగింది. ఆర్ఆర్ఆర్ తర్వాత ఆయన గ్లోబల్ స్టార్ గా మారిపోయారు. కాగా, ప్రస్తుతం ఆయన సినిమాలు చేస్తూనే మరోపక్క వరుస పెట్టి కమర్షియల్ యాడ్స్ చేస్తూ అభిమానులను అలరిస్తున్నాడు. ఇప్పటికే పలు యాడ్స్ చేసిన ఎన్టీఆర్..తాజాగా మెక్ డోనాల్డ్స్ యాడ్ లో కనువిందు చేసాడు. యాడ్ విషయానికి వస్తే..స్నేహితులతో కలిసి చికెన్ తినడానికి ఎన్టీఆర్ రెడీ అయ్యారు.
అంతలో ఆయన ముందుకు ఓ మేనేజర్ వచ్చారు! ‘సార్… సార్… ఇది క్లోజింగ్ టైమ్’ అంటూ చేతికి ఉన్న గడియారంలో టైమ్ చూపించాడు. వెంటనే ఎన్టీఆర్ అగ్గిపెట్టె తీసుకుని ఓ స్టిక్ బయటకు తీశారు. అగ్గిపుల్ల వెలిగించారు. చంద్రుడికి అంటించారు. ఇంకేం ఉంది? చంద్రుడు కాస్తా సూర్యుడు అయిపోయాడు. ‘సార్… ఇది ఓపెనింగ్ టైమ్’ అని కూల్ గా చెప్పారు యంగ్ టైగర్. అందరూ కలిసి చికెన్ తిన్నారు. యాడ్ చివరలో ‘మెక్ డొనాల్డ్స్ మెక్ స్పైసీ చికెన్ షేర్స్! స్పైసీని మీరు వివరించలేరు… షేర్ చేసుకోవాలి’ అంటూ ఎన్టీఆర్ చెప్పిన డైలాగ్ ఆకట్టుకుంది. మెక్ డొనాల్డ్స్ కంటే ముందు ఎన్టీఆర్ లీషియస్, యాపీ ఫిజ్ రెండు యాడ్స్ చేసాడు. ఆ రెండూ కూడా ఫుడ్ యాడ్స్ కావడం విశేషం. ఫస్ట్ Appy Fizz డ్రింక్ కోసం ఎన్టీఆర్ యాడ్ చేశారు. ఆ తర్వాత ఆన్లైన్లో ఆర్డర్ చేస్తే ఇంటికి మీట్ డెలివరీ చేసే లీషియస్ కోసం ఓ యాడ్ చేశారు. ఇప్పుడు మెక్ డొనాల్డ్స్ యాడ్ చేశారు.