»Mahesh Babu It Is True That Mahesh Babu Took 5 Crores But
Mahesh Babu: మహేష్ బాబు 5 కోట్లు తీసుకున్నది నిజమే.. కానీ?
రీసెంట్గా సూపర్ స్టార్ మహేష్ బాబు.. ఓ యాడ్ కోసం సెననుకు 5 కోట్ల పారితోషికం తీసుకున్నాడనే వార్తలు చాలా వైరల్ అయ్యాయి. అయితే.. మహేష్ 5 కోట్లు తీసుకున్నది నిజమే కానీ.. అందులో నిజం లేదని అంటున్నారు.
Mahesh Babu: కేవలం సినిమాలే కాదు.. కమర్షియల్‌గా, బిజినెస్ పరంగా కూడా సూపర్ స్టార్ మహేష్ బాబు క్రేజ్ నెక్స్ట్ లెవల్ అనేలా ఉంది. టాలీవుడ్ హీరోల్లో కమర్షియల్‌గా మహేష్ బాబునే టాప్ ప్లేస్‌లో ఉన్నాడు. ఒక్కో యాడ్‌కు కోట్ల రూపాయలు తీసుకుంటున్నాడు మహేష్. లేటెస్ట్గా ఓ 5 సెకండ్ల యాడ్‌కు 5 కోట్లు తీసుకున్నట్టుగా వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ప్రస్తుతం దేశంలో డిజిటల్ చెల్లింపులు పెరిగిన విషయం తెలిసిందే. ఫోన్ పే, గూగుల్‌పే, పేటీఎం లాంటి యూపిఐ యాప్స్ ఎన్నో అందుబాటులోకి వచ్చాయి. దీంతో ఫోన్‌పే యూపిఐ మహేష్ బాబుతో టైఅప్ అయింది.
ఫోన్ పే ద్వారా మనీ ట్రాన్స్ఫర్ చేస్తే, మనీ రిసీవ్డ్.. హ్యాట్సాఫ్ గురువుగారు అంటూ మహేష్ బాబు వాయిస్ వినిపించనుంది. అయితే.. ఈ ఐదు సెకన్ల వాయిస్ కోసం మహేష బాబుకు ఫోన్ పే సంస్థ ఏకంగా 5 కోట్ల పారితోషికం చెల్లించినట్లు తెలుస్తోంది. దీంతో సెకనుకు కోటీ రూపాయలా? అంటూ అంతా షాక్ అయ్యారు. కానీ ఇందులో నిజం లేదని అంటున్నారు. మహేష్ బాబు ఫోన్ పే సంస్థకు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నాడు.
అందుకోసం భారీ రెమ్యూనరేషన్ అందుకున్నది నిజమే కానీ.. కేవలం 5 సెకన్ల వాయిస్ కోసం 5 కోట్లు తీసుకోలేదని మహేష్ బాబు టీం క్లారిటీ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఫోన్ పే సంస్థకు బ్రాండ్ అంబాసిడర్ వ్యవహరిస్తున్నాడు కాబట్టి.. అందులో భాగంగా కొన్ని యాడ్స్‌తో పాటు.. వాయిస్ ఓవర్ కూడా ఇచ్చాడు. అంతే తప్పా.. వాయిస్ ఓవర్ కోసమే రెమ్యునరేషన్ అనే మాట వాస్తవం కాదని చెబుతున్నారు. ఏదేమైనా.. యాడ్స విషయంలో మహేష్ తర్వాతే ఎవ్వరైనా!