»Rakul Preet Singh Will You Do The Same Even If You Get Married
Rakul Preet Singh: పెళ్లైనా అదే చేస్తా?
ఎట్టకేలకు కోరుకున్న వాడితో తన మెడలో మూడు ముళ్లు వేయించుకుంది స్టార్ హీరోయిన రకుల్ ప్రీత్ సింగ్. దీంతో అమ్మడు సెకండ్ ఇన్నింగ్‌కు రెడీ అవుతోందట. ఏ మాత్రం గ్యాప్ లేకుండా రచ్చ లేపనుందట రకుల్.
Rakul Preti Singh: రీసెంట్‌గానే నటుడు, నిర్మాత జాకీ భగ్నానీతో కలిసి ఏడు అడుగులు వేసింది. గత కొన్నాళ్లుగా పీకల్లోతు ప్రేమలో ఉన్న ఈ జంట.. గోవాలో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకున్నారు. అయితే.. ఈ పెళ్లికి టాలీవుడ్ నుంచి లక్ష్మీ మంచు వెళ్లినట్టుగా సమాచారం. ఇక పెళ్లి చేసుకుంది కదా.. రకుల్ ఇకపై సినిమాలు చేస్తుందా? లేక సంసార జీవితానికే అంకితమవుతుందా? అనే డౌట్స్ ఉండేవి. కానీ రకుల్ మాత్రం తగ్గేదేలే అంటోందట. ఎప్పటిలాగే సినిమాలు చేయడానికి రెడీ అవుతోంది.
ఇప్పటికే నయన తార, కాజల అగర్వాల్, ఆలియా భట్, దీపిక పదుకొనే, కియారా అద్వానీ, లావణ్య త్రిపాఠి లాంటి వారు పెళ్లి చేసుకొని సినిమాలు చేస్తున్నారు. పెళ్లయిన తర్వాత కూడా హీరోయిన్లుగా దూసుకుపోతున్నారు. ఇప్పుడు సెకండ్ ఇన్సింగ్స్ మొదలు పెట్టడానికి రెడీ అవుతోందట రకుల్. ఇప్పటికే పెళ్లికి ముందు రకుల్ కొన్ని ప్రాజెక్ట్స్‌కి కమిట్ అయింది. వాటిలో కొన్ని సెట్స్ పై ఉండగా.. మరికొన్ని ప్రారంభం కావాల్సి ఉంది. ఈ సినిమాలతో పాటు.. కొత్త కథలు కూడా వింటోందట అమ్మడు. ఈసారి అంతకుమించి అనేలా సినిమాలు చేయడానికి ప్లాన్ చేస్తోందట.
ప్రస్తుతం ఈ హాట్ బ్యూటీ హనీమూన్తో బిజీగా ఉంది. త్వరలోనే సెకండ్ ఇన్నింగ్స్‌లో రచ్చ చేయడానికి సై అంటోంది. అంతేకాదు.. తన భర్త జాకీ భగ్నాని హీరో కం ప్రొడ్యూసర్ కావడంతో నిర్మాణ రంగంలోని రాణించాలని అనుకుంటోందట. ప్రస్తుతం రకుల్ నటించిన సినిమాల్లో ఇండియన్ 2 రిలీజ్‌కు రెడీ అవుతోంది. అయితే.. తెలుగులో మాత్రం అమ్మడి చేతిలో ఒక్క సినిమా కూడా లేదు.