ప్రస్తుతం ఉన్న స్టార్ హీరోలంతా దాదాపుగా రెండు చేతులా సంపాదిస్తున్నారు. కేవలం సినిమాలే కాకుండా.. కమర్షియల్‌గా కూడా దూసుకుపోతున్నారు. అంతేకాదు.. బిజినెస్ పరంగా కూడా సత్తా చాటుతున్నారు. ఇప్పుడు రవితేజ కూడా ఐమాక్స్ రెడీ చేసే పనిలో ఉన్నాడట.
Raviteja: అల్లు అర్జున్, మహేష్ బాబు లాంటి స్టార్ హీరోలు.. ఓ వైపు సినిమాలు చేస్తునే మరోవైపు పలు బ్రాండ్స్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నారు. ఒక్కో యాడ్‌కు కోట్లకు కోట్ల పారితోషికం తీసుకుంటున్నారు. అయితే ఒక్క యాడ్స్ పరంగానే కాదు.. బిజినెస్ పరంగాను దూసుకుపోతున్నారు. ఇప్పటికే మహేష్ సినిమాలు కూడా నిర్మిస్తున్నాడు.. అలాగే పలు వ్యాపారాల్లో భాగస్వామిగా ఉన్నాడు. వాటిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏఎంబీ సినిమాస్.
ప్రస్తుతం హైదరాబాద్‌లో ఇదే నంబర్ వన్ మల్టీప్లెక్స్ అని చెప్పొచ్చు. ఈ విషయంలో మహేష్‌ను ఫాలో అవుతున్నారు కొంతమంది హీరోలు. ఇప్పటికే విజయ్ దేవరకొండ కూడా మల్టీప్లెక్స్ ఫీల్డ్‌లో ఉన్నాడు. అల్లు అర్జున్ కూడా హైదరాబాద్ సత్యం థియేటర్ ప్లేస్‌లో ‘ఏఏఏ’ పేరుతో మల్టీప్లెక్స్ నిర్మించాడు. ఇక ఇప్పుడు మాస్ మహారాజా రవితేజ కూడా మల్టీప్లెక్స్ బిజినెస్‌లోకి దిగుతున్నాడు. ఇప్పటికే ఏషియన్ సునీల్‌తో కలిసి మల్టీ ఫ్లెక్స్ నిర్మిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి.
హైదరాబాద్ దిల్సుఖ్ నగర్లో ఓ మల్టీప్లెక్స్‌ని నిర్మిస్తున్నట్టుగా సమాచారం. అయితే.. ఇది మల్టీప్లెక్స్‌గా కాకుండా.. ఐమాక్స్ వెర్షన్లో కడుతున్నారట. ఇప్పటికే ఐమాక్స్ సంస్థతో చర్చలు జరుపుతున్నారట. త్వరలోనే దీనికి సంబంధించిన అగ్రిమెంట్ చేసుకోబోతున్నారట. దీనికి ఏఆర్టీ సినిమాస్.. అంటే ఏషియన్ రవితేజ సినిమాస్ అనే పేరు పెట్టబోతున్నారట. త్వరలోనే రవితేజ ఐమాక్స్ విషయంలో క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉందంటున్నారు. ఇకపోతే.. రీసెంట్గా ఈగల్ సినిమాతో అలరించిన మాస్ రాజా.. ప్రస్తుతం హరీష్ శంకర్‌తో ‘మిస్టర్ బచ్చన్’ అనే సినిమా చేస్తున్నాడు.