»New Feature In Google Map Direction In Lock Screen
Google Map: గూగుల్ మ్యాప్స్‌లో కొత్త ఫ్యూచర్
గూగుల్ మ్యాప్స్‌లో ఇప్పటికే వాట్సప్ అవసరం లేకుండానే రియల్ టైమ్ లొకేషన్ షేరింగ్, ఫ్యూయెల్ సేవింగ్ వంటి ఫీచర్లను తీసుకొచ్చిన గూగుల్ మ్యాప్స్.. తాజాగా లాక్ స్క్రీన్‌పైనే లొకేషన్ కనిపించే సదుపాయాన్ని యూజర్లకు పరిచయం చేసింది.
New feature in google map.. Direction in lock screen
Google Map: కొత్త ప్రదేశాలకు వెళ్లాలన్నా, షార్ట్‌కట్ రూట్స్‌లో ప్రయాణించాలన్నా సాధారణంగా గూగుల్ మ్యాప్స్‌ను ఉపయోగిస్తాము. ఈ యాప్ కూడా వినియోగదారుల కోసం నిత్యం కొత్త ఫీచర్లను తీసుకొస్తుంది. వాట్సప్ అవసరం లేకుండా రియల్ టైమ్ లొకేషన్ షేరింగ్, ఫ్యూయెల్ సేవింగ్ వంటి ఫీచర్లను తీసుకొచ్చిన గూగుల్ మ్యాప్స్. తాజాగా మరో కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది. లాక్ స్క్రీన్‌పైనే లొకేషన్ కనిపించే సదుపాయాన్ని యూజర్లకు అందుబాటులోకి తీసుకొచ్చింది. గూగుల్ మ్యాప్స్‌లో మన లోకేషన్‌ను వివరాలను ఎంటర్ చేస్తే షార్ట్‌కట్ రూట్, సమయం చూపిస్తుంది. తాజా ఫీచర్‌తో మొబైల్ లాక్ స్క్రీన్‌పై ఈటీఏ (estimated time of arrival), వెళ్లాల్సిన ప్రదేశానికి డైరెక్షన్స్ కనిపిస్తాయి. ఇకపై గూగుల్ మ్యాప్ ఓపెన్ చేయాల్సిన అవసరం లేదు.
మనకు కావాల్సిన లొకేషన్‌కు సంబంధించిన వివరాలు ఎంటర్ చేయగానే ప్రివ్యూ కనిపిస్తుంది. మీరు వేరే రూట్లో వెళ్తున్నప్పుడు రూట్ అప్టేడ్ అవుతుంది. గూగుల్ మ్యాప్స్‌లో గ్లాన్సబుల్ ఫీచర్ డీఫాల్ట్‌గా ఆఫ్‌లో ఉంటుంది. దాన్ని ఎనేబుల్ చేయాలంటే.. యాప్ ఓపెన్ చేసి పైన కుడివైపు కనిపించే మీ ప్రొఫైల్ ఐకాన్‌పై క్లిక్ చేయాలి. Settings ను ఎంచుకొని స్క్రోల్ చేస్తే Navigation settings లో Glanceable directions while navigating ఉంటుంది. దాన్ని ఎనేబుల్ చేసుకోవాలి. గూగుల్ మ్యాప్స్ కొత్తగా తీసుకొచ్చిన ఈ ఫీచర్ ఆండ్రాయిడ్, ఐఫోన్ వినియోగదారులకు అందుబాటులో ఉంది.