»Tata Institutes Sensational Success In Research On Cancer Treatment Tablet For Rs 100
Tata Cancer Institute: టాటా ఇన్స్టిట్యూట్ విజయం.. మళ్లీ క్యాన్సర్ రాకుండా టాబ్లెట్
రెండవసారి క్యాన్సర్ రాకుండా టాటా ఇన్స్టిట్యూట్ పరిశోధకులు అతి తక్కువ ధరకే టాబ్లెట్‌ను ఆవిష్కరించారు. అతి త్వరలోనే మార్కెట్లోకి తీసుకొస్తున్నట్లు టాటా ఇన్సిస్టిట్యూట్ వైద్యులు తెలిపారు.
Tata Institute's sensational success in research on cancer treatment.. Tablet for Rs.100
Tata Cancer Institute: దేశ ఆర్థిక రాజధాని ముంబైలో ఉన్న క్యాన్సర్ పరిశోధన టాటా ఇన్స్టిట్యూట్(Tata Institute of Cancer Research) ఓ కీలకమైన ప్రకటన చేసింది. క్యాన్సర్ రెండవసారి రాకుండా నిరోధించే చికిత్సను విజయవంతంగా కనుగొన్నట్లు పేర్కొంది. ఈ చికిత్సలో భాగంగా ఒక టాబ్లెట్‌ను అభివృద్ధి చేశామని టాటా మెమోరియల్ హాస్పిటల్(Memorial Hospital) సీనియర్ క్యాన్సర్ సర్జన్ డాక్టర్ రాజేంద్ర బద్వే వెల్లడించారు. టాబ్లెట్ విలువ కేవలం రూ.100 అని తెలిపారు. ఇది ఇన్సిస్టిట్యూట్ పరిశోధకుల, వైద్యుల 10 ఏళ్లు కృషి అన్నారు. ఈ టాబ్లెట్ రోగులలో రెండవసారి క్యాన్సర్ రాకుండా నివారిస్తుందని పేర్కొన్నారు. రేడియేషన్, కీమోథెరపీ వంటి చికిత్సల దుష్ప్రభావాలను కూడా 50 శాతం మేర తగ్గించే సామర్థ్యం ఈ టాబ్లెట్‌కు ఉందని డాక్టర్ రాజేంద్ర బద్వే వివరించారు.
‘‘ఈ పరిశోధన కోసం పరిశోధకులు ఎలుకలలో మానవ క్యాన్సర్ కణాలను ప్రవేశపెట్టారు. దాంతో క్యాన్సర్ కణితి ఏర్పడింది. ఆ తర్వాత ఎలుకలకు రేడియేషన్ థెరపీ, కీమోథెరపీ, సర్జరీతో చికిత్స అందించారు. ఈ క్యాన్సర్ కణాలు చనిపోయి ‘క్రోమాటిన్ కణాలు’ అని పిలిచే చిన్న ముక్కలుగా విడిపోయాయని గుర్తించారు. ఈ చిన్న కణాలు రక్తం ద్వారా శరీరంలోని ఇతర భాగాలకు ప్రయాణించే అవకాశం ఉంటుంది. ఆరోగ్యకరమైన కణాలలోకి ప్రవేశిస్తే మళ్లీ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. రెండవసారి క్యాన్సర్ వచ్చే అవకాశాలను నిరోధించేందుకు వైద్యులు ఎలుకలకు రెస్వెరాట్రాల్, కాపర్ (R+Cu) కలిగిన ప్రో-ఆక్సిడెంట్ మాత్రలు ఇచ్చారు. కాపర్ (R+Cu) ఆక్సిజన్ రాడికల్లను ఉత్పత్తి చేస్తుంది. క్రోమాటిన్ కణాలను నాశనం చేస్తుంది’’ అని రాజేంద్ర బద్వే విపులంగా వివరించారు. రెండవసారి క్యాన్సర్‌ను నివారించడంలో 30 శాతం ప్రభావవంతంగా పనిచేస్తుందని, ఈ టాబ్లెట్ కు ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆమోదం కోసం ఎదురు చూస్తున్నట్లు తెలిపారు. ఇక జూన్-జులై నుంచి మార్కెట్లోకి వచ్చే అవకాశాలున్నాయని పేర్కొన్నారు.