సినిమా అంటే ఒకప్పుడు థియేటర్లలో హంగామా గుర్తుకు వచ్చేది. కానీ ఇప్పుడు ఓటీటీ(OTT)లో చూద్దాం అంటున్నారు ప్రేక్షకులు. అంతలా ఓటీటీ ప్రాధాన్యత పెరిగింది. ఒక ఓటీటీ సబ్స్క్రిప్షన్(OTT Subscription) తీసుకొని దాదాపు 5 మంది వరకు చూసే వీలుండడంతో అందరూ ఈ పద్దతినే ఫాలో అవుతున్నారు. అప్పుడప్పుడు కొత్తవారికి పాస్ వర్డ్ షేరింగ్ తో సినిమాలు చూడొచ్చు. తాజాగా పాస్ వర్డ్ షేరింగ్ విధానంపై ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్(Netflix) కీలక నిర్ణయం తీసుకుంది. పాస్వర్డ్ షేరింగ్ విధానాన్ని భారత్(India)లో నిలిపివేసినట్లు ప్రకటించింది. ఎవరైతే నెట్‌ఫ్లిక్స్ చందా తీసుకుంటారో ఆ వ్యక్తి కుటుంబ సభ్యులు మాత్రమే ఇకపై యాక్సెస్ పొందేలా గైడెన్స్ ను జారీ చేసింది. ఇదే విషయాన్ని తెలుపుతూ నెట్‌ఫ్లిక్స్ యూజర్లకు మెయిల్స్ పంపింది.
మాములుగా ఓటీటీ(OTT) ఖాతా తీసుకున్న తరువాత కొంత మందికి యాక్సెస్ ఉంటుంది. ఆ తరువాత అలా కాకుండా పాస్ షేరింగ్ విధానంతో కొత్తవాళ్లు సినిమాలు చూస్తుంటారు. ఇప్పుడు దీన్ని భారత్‌లో నిలిపివేసింది. ఎవరైతే నెట్‌ఫ్లిక్స్ ఖాతా తీసుకుంటారో వారు మాత్రమే ఇకపై ఓటీటీ సేవలు వినియోగించుకోగలుగుతారని స్పష్టం చేసింది. కస్టమర్ల అభిరుచి, వారి సంతృప్తి మేరకు పెద్ద మొత్తంలో డబ్బులు పెట్టి టీవీ షోలు, సినిమాలను కొనుగోలు చేస్తున్నామని నెట్‌ఫ్లిక్స్(Netflix) వివరించింది. అయితే, చందాదారుల కుటుంబ సభ్యులు ఎక్కడికైనా వెళ్లినప్పుడు, ప్రయాణ సమయంలో కూడా ఓటీటీ సదుపాయం పొందవచ్చని తెలిపింది. ప్రొఫైల్‌ను బదిలీ చేయటం, మేనేజ్ యాక్సెస్ అండ్ డివైజస్ వంటి కొత్త ఫీచర్ల సాయంతో ఓటీటీ ప్రయోజనాలను పొందవచ్చని ఆ సంస్థ తెలిపింది. ఈ సదుపాయాన్ని ఎలా వినియోగించుకోవాలో కూడా ఈ ఓటీటీ దిగ్గజం తన ఫ్లాట్‌ఫాం ద్వారా పంచుకుంది.