Netflix Subscription Plan: యూజర్లకు షాక్ ఇచ్చేందుకు సిద్ధం అవుతోంది నెట్ ప్లిక్స్ (Netflix) . సబ్ స్క్రిప్సన్ ప్లాన్ పెంచనుంది. అదీ భారతదేశంలో కాదని తెలిసింది. దీంతో ప్రస్తుతం ఇండియన్ యూజర్స్ ఊపిరి పీల్చుకోవచ్చు. ఆ తర్వాత మాత్రం వాత ఉండనుంది.
ఒకటి రెండు నెలల్లో.. లేదంటే వచ్చే ఏడాది ధరలు పెంచనుందని వాల్ స్ట్రీట్ జర్నల్ కథనం ప్రచురించింది. గతంలో ధరల పెంపుపై వచ్చిన నివేదికలను ప్రస్తావిస్తూ.. అవి నిజమేనని కథనంలో పేర్కొంది. ఏ స్థాయిలో ధరలను పెంచుతారనే అంశంపై స్పష్టత లేదు. అమెరికా, కెనడా దేశాల్లో మాత్రం ధరల పెంపు ఉంటుందట.. భారత్‌కు సంబంధించి క్లారిటీ లేదు.
గత ఏడాది ధరలను పెంచిన నెట్ ప్లిక్స్.. ఇప్పుడు మరోసారి నిర్ణయం తీసుకోనుంది. దీంతో యూజర్ల నుంచి వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. ప్రత్యామ్నాయ ఓటీటీ నెట్ వర్క్ ఉపయోగించేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అంతకుముందు పాస్ వర్డ్ షేర్ చేస్తే అదనంగా కొంత మొత్తం చెల్లించాలని స్పష్టంచేసింది. యూజర్ల నుంచి వ్యతిరేకత రావడంతో స్వస్తి చెప్పింది. ఆ తర్వాత యూజర్లకు మళ్లీ నోటిఫికేషన్లు పంపించింది.
పాస్ వర్డ్ షేరింగ్‌కు యూజర్ల నుంచి డబ్బులు వసూల్ చేయడం ఆపేసింది. దీంతో యూజర్లు మళ్లీ పెరిగారు. ఈ సంవత్సరం రెండో క్వార్టర్లో 6 మిలియన్ వచ్చారు. 8 శాతం పెరుగుదలను చూపించింది. నెట్ ప్లిక్స్లో కంటెంట్ క్లీన్‌గా ఉంటుంది. వీడియో క్వాలిటీ, ఆడియో క్వాలిటీ సూపర్బ్‌గా ఉంటుంది. ఒకసారి తెలుగు, హిందీ.. లేదంటే ఇంగ్లీష్ మూవీ అందులో చూస్తే.. మరొ దాంట్లో చూడలేరు.