»Minister T Harish Rao Fire On Oppositions Dharani Abolishment Statements
Dharani రద్దు చేస్తే ప్రజలు మిమ్మల్ని రద్దు చేస్తారు: మంత్రి హరీశ్ రావు
రైతు పథకాలపై ఇతర రాష్ట్రాలు ఆసక్తి కనబరుస్తున్నాయని వివరించారు. ఇటీవల పంజాబ్, ఢిల్లీతో పాటు ఇతర రాష్ట్రాల ప్రతినిధులు పర్యటించడాన్ని ప్రస్తావించారు. సంగారెడ్డి జిల్లా (Sangareddy District)లో సోమవారం మంత్రి పర్యటించారు.
తెలంగాణ పథకాలు ఇతర రాష్ట్రాలు ఆసక్తిగా గమనిస్తున్నాయని.. తమ రాష్ట్రాల్లో కూడా అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాయని తెలంగాణ మంత్రి హరీశ్ రావు (T Harish Rao) తెలిపారు. ముఖ్యంగా రైతు పథకాలపై ఇతర రాష్ట్రాలు ఆసక్తి కనబరుస్తున్నాయని వివరించారు. ఇటీవల పంజాబ్, ఢిల్లీతో పాటు ఇతర రాష్ట్రాల ప్రతినిధులు పర్యటించడాన్ని ప్రస్తావించారు. సంగారెడ్డి జిల్లా (Sangareddy District)లో సోమవారం మంత్రి పర్యటించారు.
ఈ సందర్భంగా సంగారెడ్డి కలెక్టరేట్ (Sangareddy Collectorate)లో 58, 59 జీవో ప్రకారం లబ్ధిదారులకు భూమి పట్టాలు పంపిణీ చేశారు. అనంతరం మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ..‘ధరణి పోర్టల్ తో సులభంగా, వేగవంతంగా పనులు జరుగుతున్నాయి. ప్రజలు కార్యాలయాల చుట్టూ తిరగకుండా భూమి క్రయవిక్రయాలు చేస్తున్నారు.పైసా ఖర్చు లేకుండా ఇంటికే పట్టాదారు పాస్ పుస్తకాలు వస్తున్నాయి. ధరణిపై అవగాహన లేకుండా కొందరు మాట్లాడుతున్నారు. ధరణితో అవినీతి (Corruption) తగ్గింది.. పారదర్శకత పెరిగింది. ధరణి (Dharani)తో ప్రజలు సంతోషంగా ఉన్నారు. ఒకవేళ ధరణి రద్దు చేస్తే మళ్లీ లంచావతారం పెరుగుతంది. దాన్ని రద్దు చేస్తే ప్రజలు మిమ్మల్ని రద్దు చేస్తారు’ ప్రతిపక్ష పార్టీల విమర్శలను తిప్పికొట్టారు.
అనంతరం సంగారెడ్డి ప్రభుత్వ వైద్య కళాశాల (Sangareddy Govt Medical College)లో ఏర్పాటుచేసిన ఈ-లైబ్రరీ (E Library)ని మంత్రి ప్రారంభించారు. ఈ కళాశాలను రికార్డు సమయంలో ఏడు నెలల్లోనే పూర్తి చేసినట్లు మంత్రి తెలిపారు. ఈ సందర్భంగా గవర్నర్ వైద్య కళాశాలలపై చేసిన ట్వీట్ పై మళ్లీ ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ (K Chandrasekhar Rao) ఆధ్వర్యంలో 12 వైద్య కళాశాలలు ప్రారంభించుకున్నామని, రాష్ట్రంలో ప్రతి లక్ష మందికి 19 ఎంబీబీఎస్ సీట్లు (MBBS Seats) అందుబాటులో ఉన్నాయని మంత్రి హరీశ్ రావు తెలిపారు.