»Telangana High Court Comments On Dharani Portal Brokers
Telangana High Court: ధరణి బ్రోకర్లను పెంచి పోషిస్తుంది
తెలంగాణ(telangana)లో ధరణి పోర్టల్(dharani portal) వల్ల అనేక మంది రైతులు ఇబ్బందులు పడుతున్నారని హైకోర్టు ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ పోర్టల్ వల్ల సమస్యలు తీరకపోగా..మధ్యవర్తులే(brokers) ఎక్కువగా లాభపడుతున్నారని వెల్లడించింది.
తెలంగాణలో మధ్యవర్తుల(brokers) నిర్మూలన కోసం ధరణి పోర్టల్(Dharani portal)ను తీసుకొచ్చినప్పటికీ, ఇది మరింత మంది బ్రోకర్లను పెంచి పోషిస్తోందని హైకోర్టు(telangana High Court) వ్యాఖ్యానించింది. భూముల క్రమ విక్రయాలు జరిగినప్పుడు సంబంధిత వ్యక్తులకు సీల్ డీడ్ కాపీలు ఇవ్వడం లేదనే అంశంపై దాఖలైన పిటిషన్లపై హైకోర్టు మంగళవారం విచారణ జరిపింది. ఈ క్రమంలో ఈ అంశంపై ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ చీఫ్ కమిషనర్ (CCLA) నవీన్ మిట్టల్(naveen mittal) మంగళవారం జస్టిస్ కె.లక్ష్మణ్ ఎదుట హాజరయ్యారు.
కోర్టులో రోజురోజుకూ అట్టుడుకుతున్న పిటిషన్లను సీసీఎల్ఏ దృష్టికి తీసుకొచ్చారు. వీరంతా ధరణి పోర్టల్ వల్ల కలుగుతున్న సమస్యలపై మాట్లాడారు. మధ్యవర్తుల నిర్మూలన కోసం ఈ పోర్టల్‌ను తీసుకొచ్చినప్పటికీ సమస్యలు ఎందుకు పరిష్కారం కావడం లేదని హైకోర్టు ప్రశ్నించింది. దీంతోపాటు సర్టిఫైడ్ కాపీలు ఇవ్వకుంటే బాధితులు ఎక్కడికి వెళ్లాలని న్యాయమూర్తి ప్రభుత్వ అధికారిని ప్రశ్నించారు. అసలు సక్సెషన్, పార్టిషన్ కాపీలు రిజెక్ట్ అయితే ఎందుకు తిరస్కరిస్తున్నారో కారణాలు చెప్పడం లేదని గుర్తు చేశారు.
నాలుగు గుంటల విషయంలో కూడా మాడ్యూల్ రిజెక్ట్ చేసిందని ఆదిలాబాద్(adilabad)కు చెందిన ఓ వ్యక్తి కోర్టు కెక్కారు. 45 రోజులు గడిచినా కూడా పని కాలేదని వెల్లడించారు. మరోవైపు రెండు వారాల్లో కావాల్సిన పనులు కూడా కావడం లేదన్నారు. ధరణి(Dharani)లో సమస్యల వల్ల ప్రతి రోజు 30 నుంచి 40 కేసులు కోర్టుకు వస్తున్నాయని న్యాయమూర్తి వెల్లడించారు. ఈ నేపథ్యంలో కోర్టుపై కూడా కేసుల భారం పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా కోర్టుకు వివరణ ఇస్తూ.. 4 వారాల్లోగా మాడ్యూల్స్ తెరుచుకుంటాయని, అన్ని సమస్యలూ పరిష్కరిస్తామని నవీన్ మిట్టల్(naveen mittal) హామీ ఇచ్చారు. ధరణిలో భూపరిపాలనలో ఉన్న అన్ని వ్యత్యాసాలను రాష్ట్ర ప్రభుత్వం త్వరలో తొలగిస్తుందని హైకోర్టుకు తెలిపారు. సేల్ డీడ్లు, ఈ-పట్టాదార్ పాస్‌బుక్‌లు మొదలైన వాటి కాపీలను పొందడంలో భూ యజమానుల ఫిర్యాదులను త్వరలో పాస్ చేస్తానని చెప్పారు.