»Mekapati Chandrasekhar Reddy Did A Mistakerajamohan Reddy
Mekapati chandrasekharది తప్పే: సోదరుడు రాజమోహన్ రెడ్డి
ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ ఎమ్మెల్యేల క్రాస్ ఓటింగ్ గురించి మేకపాటి రాజమోహన్ రెడ్డి స్పందించారు. తన తమ్ముడు చంద్రశేఖర్ క్రాస్ ఓటింగ్ చేయడం తప్పేనన్నారు.
Mekapati chandrasekhar reddy did a mistake:Rajamohan reddy
Mekapati Rajamohan reddy:ఏపీలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలు నలుగురు వైసీపీ ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్ చేయగా.. వారిని పార్టీ నుంచి సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. ఇదే అంశంపై సస్పెన్షన్‌కు గురయిన మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి సోదరుడు రాజమోహన్ రెడ్డి (Mekapati Rajamohan reddy) స్పందించారు. చంద్రశేఖర్ (chandrasekhar) క్రాస్ ఓటింగ్ చేయడం తప్పేనని రాజమోహన్ రెడ్డి (Rajamohan reddy)అన్నారు. తన మాట వినకుండా పార్టీకి ద్రోహం చేశారని ఆరోపించారు. ఇప్పుడే కాదు చిన్నప్పటి నుంచి వైఖరి తప్పుగా ఉండేదన్నారు. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కాస్త బాగానే ఉన్నాడని తెలిపారు.
సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటున్నాడని.. అందరినీ కలుపుకుని వెళతాడని గుర్తుచేశారు. తమ్ముడితో పోలిస్తే.. తనలోనే కలుపుగొలుపుతనం తక్కువ అని చెప్పారు. 2019 వరకు బానే ఉన్నాడని.. ఆ తర్వాత తమ్ముడి వంచన ఓ దుష్టశక్తి వచ్చి చేరిందని పేర్కొన్నారు. నీచమైన పనులను చేయిస్తోందని తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ పరమ నీచమైన పని అని రాజమోహన్ రెడ్డి (Rajamohan reddy) మండిపడ్డారు.
విషయం తెలిసి తమ్ముడి వద్ద ఉండే వ్యక్తులతో వారించే ప్రయత్నం చేశానని తెలిపారు. చేసిన పనికి ఈ రోజు ఒంటరివాడు అయిపోయాడని గుర్తుచేశారు. ఇప్పుడు అతనితో మాట్లాడేవారు కూడా లేరని చెప్పారు. జరిగిన ఘటనలపై చింతిస్తున్నానని.. ఉదయగిరి ప్రజలకు క్షమాపణ కోరుతున్నానని పేర్కొన్నారు. తమ్ముడి తీరు నచ్చకపోవడంతో గత మూడేళ్ల నుంచి దూరంగా ఉంటున్నానని పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో ఉదయగిరిలో వైసీపీ ఎవరికీ టికెట్ ఇచ్చినా.. గెలిపిస్తామని రాజమోహన్ రెడ్డి (Rajamohan reddy) స్పష్టంచేశారు.
క్రాస్ ఓటింగ్ తర్వాత చంద్రశేఖర్‌ను (chandrasekhar) పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. అంతకుముందే వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇవ్వమని సీఎం జగన్ (cm jagan) చెప్పారట. సెకండ్ గ్రేడ్ క్యాడర్‌కు చెందిన చేజర్ల సుబ్బారెడ్డికి (subba reddy) టికెట్ ఖాయం అనే ప్రచారం జరుగుతోంది. అందుకోసమే చంద్రశేఖర్ (chandrasekhar) సవాల్ చేస్తే.. వెంటనే రియాక్ట్ అయ్యారు.