»Medico Preethi Case Senior Student Saif Arrested By Mattewada Police
Medico Preethi బిగ్ ట్విస్ట్.. ప్రీతిని వేధించిన నిందితుడు సైఫ్ అరెస్ట్
బాధితురాలు ఆరోపణల నేపథ్యంలో సైఫ్ పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుతో పాటు మరికొన్ని సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. విచారణ చేపట్టిన వరంగల్ జిల్లా పోలీసులు తాజాగా సైఫ్ ను అదుపులోకి తీసుకున్నారు. మట్టెవాడ పోలీసులు సైఫ్ అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన వివరాలు మరిన్ని తెలియాల్సి ఉంది.
కాకతీయ వైద్య కళాశాల విద్యార్థిని ప్రీతి (Medico) ఆత్మహత్యాయత్నం కేసు కీలక మలుపు తిరిగింది. వేధింపులకు పాల్పడుతున్న సీనియర్ (Senior) పీజీ విద్యార్థి డాక్టర్ సైఫ్ (Saif) ను పోలీసులు అరెస్ట్ చేశారు. తెల్లవారుజామున మట్టెవాడ పోలీసులు (Mattewada Police) అతడిని అదుపులోకి తీసుకున్నారు. సీనియర్ తనను వేధిస్తున్నాడని ఆరోపిస్తూ ప్రీతి ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆమె హైదరాబాద్ లోని నిమ్స్ ఆస్పత్రి (NIMS)లో చికిత్స పొందుతున్నది. ఆమె పరిస్థితి ఇంకా విషమంగానే ఉందని వైద్యులు తెలిపారు.
కాగా బాధితురాలు ఆరోపణల నేపథ్యంలో సైఫ్ పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ (SC, ST Atrocity Case) కేసుతో పాటు మరికొన్ని సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. విచారణ చేపట్టిన వరంగల్ జిల్లా పోలీసులు తాజాగా సైఫ్ ను అదుపులోకి తీసుకున్నారు. మట్టెవాడ పోలీసులు సైఫ్ అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన వివరాలు మరిన్ని తెలియాల్సి ఉంది. కాగా నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ప్రీతికి డాక్టర్ పద్మజా నేతృత్వంలోని ఐదుగురు వైద్యుల బృందం వైద్యం అందిస్తోంది. ఆమె ప్రాణాలు నిలిపేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఎప్పటికప్పుడు పరీక్షలు చేస్తూ ఆమె పరిస్థితి మెరుగయ్యేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
ప్రీతి కేసును తెలంగాణ ప్రభుత్వం సవాల్ గా స్వీకరించింది. ఈ ఘటనపై విచారణకు ఆదేశించింది. బాధితురాలికి న్యాయం జరిగేలా చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు ప్రత్యేక దృష్టి సారించారు. బాధితురాలి కుటుంబంతో మంత్రి మాట్లాడారు. మీకు న్యాయం జరుగుతుందని భరోసా ఇచ్చారు. అంతకుముందు ప్రీతిని ఆస్పత్రిలో గవర్నర్ తమిళి సై సౌందరరాజన్ పరామర్శించారు. ఈ సందర్భంగా ప్రీతికి అందిస్తున్న సేవలపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. కాగా ఈ సంఘటనపై ప్రతిపక్ష పార్టీలు ఆందోళనలు చేపట్టాయి. ఈ సందర్భంగా కాకతీయ వైద్య కళాశాలను ముట్టడించేందుకు ప్రయత్నించాయి. కాంగ్రెస్, సీపీఐ, సీపీఐఎంతో పాటు బీజేపీకి చెందిన యువజన, విద్యార్థి సంఘాలు ఉద్యమాలకు పిలుపునిచ్చాయి. ర్యాగింగ్ భూతాన్ని నియంత్రించాలని డిమాండ్ చేశాయి. బాధితురాలి కుటుంబానికి న్యాయం చేయాలని కోరాయి. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి విన్నవించాయి. ర్యాగింగ్ నియంత్రణకు విద్యాలయాల్లో ప్రత్యేక చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
నిందితుడు సైఫ్ కు సంబంధించిన ఆధారాలు లభ్యమవుతున్నాయి. సోషల్ మీడియా వేదికగా సైఫ్ ప్రీతికి పంపిన సందేశాలు పోలీసులు పరిశీలించారు. దీంతో పాటు కాకతీయ వైద్య కళాశాలలో సైఫ్ ప్రవర్తనపై ఆరా తీశారు. అతడు జూనియర్ విద్యార్థులపై వేధింపులకు పాల్పడేవాడని విద్యార్థులు ఫిర్యాదు చేశారు. అనస్థీషియా విభాగానికి చెందిన ప్రీతిని వేధించడం వాస్తవమేనని పోలీసులకు తెలిపారు. ఈ విషయమై ప్రీతి గతంలో అధికారులకు ఫిర్యాదు కూడా చేసినట్టు తెలుస్తున్నది.