Manish Sisodia named as accused for first time in Delhi liquor scam
Delhi liquor scam:ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ స్కామ్ కేసులో ఆప్ నేత, ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాను (manish sisodia) దర్యాప్తు సంస్థ సీబీఐ నిందితుడిగా చేర్చింది. ఈ మేరకు రౌస్ అవెన్యూ కోర్టులో సీబీఐ అనుబంధ చార్జిషీట్ దాఖలు చేసింది. సిసోడియాతోపాటు విచారణను ఎదుర్కొన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత (kavitha) మాజీ ఆడిటర్ గోరంట్ల బుచ్చిబాబు పేరును కూడా చేర్చింది. అర్జున్ పాండే, అమన్ దీప్ దాల్ పేర్లు కూడా ఉన్నాయి.
సీబీఐ, ఈడీ నమోదు చేసిన అవినీతి, మనీలాండరింగ్ కేసులో సిసోడియా జ్యుడిసీయల్ కస్టడీని ఈ నెల 17వ తేదీన పొడగించిన సంగతి తెలిసిందే. చార్జిషీటులో ఉన్న అంశాలపై మే 15వ తేదీన రౌస్ అవెన్యూ కోర్టులో వాదనలు జరుగుతాయి.
2021-22లో రూపొందించిన ఎక్సైజ్ పాలసీ కొందరికీ మేలు చేసేందుకు రూపొందించబడింది. లంచం ఇచ్చిన కొందరికీ అనుకూలంగా పాలసీ ఉంది. దీనిని ఆమ్ ఆద్మీ పార్టీ (aap) ఖండించింది. ఆ తర్వాత ఎక్సైజ్ పాలసీని రద్దు చేశారు. ఈ లోపు వేల కోట్ల బదిలీ జరిగిందని సీబీఐ (cbi), ఈడీ (ed) అంటున్నాయి.
సౌత్ గ్రూప్ నుంచి రూ.150 కోట్ల వరకు ఆప్‌కు చేరాయని దర్యాప్తు సంస్థలు ఈడీ, సీబీఐ అంటున్నాయి. సౌత్ గ్రూప్‌ను బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత లీడ్ చేశారని ఆరోపణలు వచ్చాయి. ఇప్పటికే ఈడీ పలుమార్లు ఆమెను విచారించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో సీబీఐ ఏడుగురి పేర్లను చేర్చింది. ఈ నెల 16వ తేదీన కేజ్రీవాల్‌ను కూడా 9 గంటల పాటు ప్రశ్నించింది. కుంభకోణం జరిగిందనేది తప్పుడు ఆరోపణలు అని కేజ్రీవాల్ మండిపడ్డారు. బీజేపీకి అనుకూలంగా ఏజెన్సీలు పనిచేస్తున్నాయని ఆరోపించారు.