»Manikonda A Man In Lancoheels Who Promises To Give Film Chances Is A Fraud
Film Chances: అమ్మాయిలకు మూవీ ఛాన్సులని గాలం..మోసపోతున్న బాధితులు
సినిమా అవకాశాలు ఇస్తానని అమ్మాయిలను మోసం చేయడం ఎన్నో ఏళ్లగా వింటూనే ఉన్నాము. అయినా సరే అమ్మాలు బలవుతూనే ఉన్నారు. తాజాగా మణికొండలో జరిగిన ఓ యువతి ఆత్యహత్యతో దానికి కారణమైన ఓ వ్యక్తి అసలు రంగు బయటపడింది.
Manikonda, a man in Lancoheels who promises to give film chances, is a fraud
Film Chances: సినిమాలు(Movies) అంటే అందిరికి ఇష్టమే, అందరికి సరదానే. ఆ కోరికే కొందరిని స్టార్లను చేస్తుంది. మరికొందరిని పాతాలానికి నెట్టేస్తుంది. ముఖ్యంగా మహిళల జీవితాలల్లో సినిమా పెను విషాదాన్ని సృష్టిస్తుంది. ఎందుకంటే వారు తేలికగా మోసపోతారు. అవకాశం(Chance) ఇస్తా అంటే నిజేమేనని నమ్ముతారు. పిలిచిన చోటుకు వెళ్తారు. ఆ తరువాత అభిమానాన్ని చంపుకోలేక, తిరిగి ఇంటికి రాలేక తనువులు చాలిస్తారు. ఇలాంటి విషాద ఘటనలను చాలా సందర్భాల్లో చూసింటాము. తాజాగా మణికొండ(Manikonda) ల్యాంకోహిల్స్( Lancoheels)లో జరిగిన ఘటన అందరిని విస్మయానికి గురిచేసింది. కొద్ది రోజుల వ్యవధిలోనే ముగ్గురు అమ్మాయిలు ఆత్మహత్య చేసుకోవడం స్థానికంగా కలవరం రేపింది.
ల్యాంకోహిల్స్ అపార్ట్మెంట్ 21వ అంతస్తుపై నుంచి బిందుశ్రీ(28) దూకి ఆత్యహత్య చేసుకోవడం సంచలనం సృష్టిస్తుంది. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. యువతి బలవన్మరణానికి వేధింపులే కారణమని నిర్ధారించారు. పోలీసుల దర్యాప్తులో వ్యాపారి, కన్నడ నటుడు అయిన ఓ వ్యక్తి సాగిస్తున్న చీకటి కార్యకలాపాలు, దారుణాలు బయటపడుతున్నాయి. స్థానికులు, పోలీసుల నుంచి సేకరించిన సమాచారం ప్రకారం.
తూర్పు గోదావరి జిల్లాకు చెందిన పూర్ణచంద్రావు కొన్ని కన్నడ సినిమాల్లో నటించి తరువాత మణికొండలో సెటిల్ అయ్యాడు. ల్యాంకోహిల్స్ అపార్ట్మెంట్స్ 15 ఎల్‌హెచ్ బ్లాక్‌లో భార్య, కుమార్తెతో ఉంటున్నాడు. కుమార్తె కేర్‌టేకర్‌గా పదేళ్లుగా కాకినాడకు చెందిన బిందుశ్రీ పనిచేస్తోంది. తనతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. కొద్దిరోజులుగా వీరి మధ్య మనస్పర్థలు మొదలయ్యాయి. ఐదురోజుల క్రితం పూర్ణచంద్రావు మరో యువతిని ఇంటికి తీసుకొచ్చాడు. దీంతో అతనితో గొడవ పడిన బిందుశ్రీ మనస్పర్థతో 21వ అంతస్తుపై నుంచి కిందకు దూకింది. గమనించిన సెక్యూరిటీ సిబ్బంది రాయదుర్గం పోలీసులకు సమాచారమిచ్చారు.
దర్యాప్తు చేపట్టిన పోలీసులకు విస్తుపోయే నిజాలు తెలిశాయి. కన్నడ సినిమాల్లో నటించానంటూ పూర్ణచంద్రావు ప్రచారం చేసుకుని అవకాశాలు ఇప్పిస్తానంటూ అమ్మాయిలకు ఆశచూపేవాడని స్థానికులు పేర్కొన్నట్లు పోలీసులు తెలిపారు. అందుకనే చాలామంది మహిళలు, యువతులు వచ్చిపోతుంటారని అపార్ట్మెంట్లోని స్థానికులు పోలీసులకు చెప్పారు. అనుమానాస్పద మృతిగా భావించిన పోలీసులు తరువాత బిందుశ్రీ మృతికి వేదింపులే కారణమని స్పష్టం చేశారు. సినిమా అంటే రంగుల ప్రపంచం అని పరిశ్రమలోకి వచ్చే అమ్మాయిలు ఎవరిని నమ్మాలో, ఎవరిని నమ్మకూడదో తెలుసుకోవాలని ఈ సందర్భంగా పోలీసులు సూచించారు.