»Gujarat Prakash Mulchand Praja Pati Who Frauded 720 Crores In The Name Of Jobs In Telangana
Jobs Fraud: జాబ్స్ పేరిట చీటింగ్..రూ.720 కోట్ల దోపిడీ
తెలంగాణలో ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి దాదాపు రూ.720 కోట్లను మోసం చేసిన గుజరాత్‌కు చెందిన ఓ వ్యక్తిపై ఈడీ అధికారులు కేసు నమోదు చేశారు. ఇతనిపై వివిధ దేశాలల్లో కేసులు నమోదు అయినట్లు తెలుస్తుంది.
Fraud: తెలంగాణ(Telangana)లో ఉద్యోగాల(JOBS) పేరిట రూ.720 కోట్లు కొల్లగొట్టిన ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది. ఈ మేరకు గుజరాత్(Gujarat) రాష్ట్రానికి చెందిన ప్రకాష్ ముల్చంద్ బాయ్ ప్రజాపతి( Prakash Mulchand Praja Pati)పై ఈడీ(ED) అధికారులు కేసు నమోదు చేశారు. మనీలాండరింగ్ చట్టం కింద ఈడీ కేసు నమోదు చేసింది. హైద్రాబాద్‌లోని ఈడీ కార్యాలయం(enforcement directorate) ఈ మేరకు ప్రజాపతితో పాటు ఆయన గ్యాంగ్ పై కేసు నమోదు చేసింది. ఇండియాతో పాటు పలు దేశాల్లో ప్రజాపతిపై కేసులు ఉన్నట్లు తెలుస్తోంది.
తెలంగాణలోని హైద్రాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనరేట్ల పరిధిలో ప్రజాపతిపై వందల కేసులు నమోదయ్యాయి. హైద్రాబాద్ నగరంలోని మూడు పోలీస్ కమిషనరేట్ల పరిధిలో నమోదైన కేసుల వివరాలను ఈడీ అధికారులు సేకరిస్తున్నారు. సోషల్ మీడియా ద్వారా పార్ట్ టైమ్ జాబ్‌ల పేరుతో ఆకర్షించేవాడు. దీనికోసం సింపుల్ టాస్కులు ఇచ్చేవారు. ఆ టాస్క్ అయిన వెంటనే వారిని ఆన్లైన్లో రుసుము చెల్లించమనే వారు. దీనికి హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు సాగించేవారు. ప్రస్తుతం దీనిపై ఈడీ దర్యాప్తు కొనసాగిస్తోంది.
ఇలాంటి మోసాలపై ఎన్ని అవగాహన కార్యక్రమాలు చేపట్టినా ప్రజలు మాత్రం మోసపోతునే ఉన్నారు. ఉద్యోగాలు ఇచ్చేవారు డబ్బులు అడిగినప్పుడు వారిపై ఫిర్యాదు చేయాల్సింది పోయి, అమాయకంగా డబ్బులు కట్టి మోసపోతున్న యువత రోజురోజుకి పెరుగుతోంది. అర్హతకు మించి ఉద్యోగాలు పొందాలనుకునేవారే వీరి టార్గెట్. లేని ఆశలు చూపించి వారి నుంచి డబ్బులు దన్నుకుంటారు. తరువాత వీరితో కనెక్షన్ కట్ చేస్తారు. ఇంకా కొందరు కన్సల్టెన్సీ పేరుతో ఆఫీసులు ఓపెన్ చేస్తారు. ఫీజు కింద కొంత డబ్బు తీసుకుంటారు. తరువాత ఆఫీస్ ఎత్తేస్తారు. ఇలాంటి మోసాలు నిత్యం జరుగుతూనే ఉంటాయి. ఈ విషయంలో ముఖ్యంగా యువత ఎక్కువ అప్రమత్తంగా ఉండాలి.