»Facebook Fraud In Hyderabad Rs 10 Lakh Lost Young Man Yousufguda
Hyderabad:లో ఫేస్ బుక్ మోసం..రూ.10 లక్షలు లూటీ
హైదరాబాద్లో ఓ యువతి ఫేస్ బుక్లో మరో అబ్బాయిని బురిడీ కొట్టించింది. ఆ క్రమంలో అతని వద్ద నుంచి 10 లక్షల రూపాయలు చీట్ చేసి తీసుకుని తిరిగి ఇవ్వకపోగా..అతన్నేరౌడీలతో కొట్టిస్తానని బెదిరించింది. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఫేస్ బుక్లో ఓ వ్యక్తికి అమ్మాయి పరిచయమైంది. వారి పరిచయం కాస్తా స్నేహంగా మారింది. రోజు చాట్ చేసుకోవడం ఒకరి గురించి ఒకరు తెలుసుకున్నారు. ఆ నేపథ్యంలోనే యువతి తన మదర్ హెల్త్ బాలేదని చెప్పి పలుమార్లు 10 లక్షలు రూపాయలు తీసుకుంది. తీరా తిరిగి ఇవ్వాలని కోరగా..ఆ యువతి బ్లాక్ చేసింది. రౌడీలతో కొట్టిస్తానని, పోలీస్ కేసు పెడతానని బెదిరించింది. ఆ క్రమంలో మోసపోయానని తెలుసుకున్న బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
ఎల్లారెడ్డి ప్రాంతంలో ఉండే అతనికి ఫేస్ బుక్లో అశ్రుతారెడ్డి అనే అమ్మాయి పరిచయమైంది. ఆమె చార్టెడ్ అకౌంటెంట్ అంటూ నమ్మించింది. ఆ నేపథ్యంలో మరొక అందమైన అమ్మాయి ఫొటో పంపించి తానే అంటూ తెలిపింది. దీంతో నమ్మిన అతనికి తన తల్లికి అనారోగ్యంగా ఉంది అని ఫేక్ మెడికల్ బిల్లులు పంపించింది. అతను నిజమని నమ్మాడు. డబ్బులు అత్యవసరమని తెలిపి పలుమార్లు ఏకంగా 10 లక్షల రూపాయలు మళ్లీ ఇస్తానని తీసుకుంది. ఆ తర్వాత కొన్ని రోజులకు అతను ఇచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వాలని కోరడంతో ఆమె బెదిరింపులకు పాల్పడింది. పోలీసులకు చెబుతానని, రౌడీలతో కొట్టిస్తానని వెల్లడించింది. దీంతో మోసపోయానని తెలుసుకున్న బాధితుడు పోలీసులకు తెలిపాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.