»Sexual Harassment Of Tenth Students Principals Case Katedan Hyderabad
Case on principal: టెన్త్ విద్యార్థులపై లైంగిక వేధింపులు..ప్రిన్సిపల్ పై కేసు
మొన్న హైదరాబాద్ డీఏవీ పబ్లిక్ స్కూల్లో చిన్నారిపై లైంగిక వేధింపులు..నిన్న హకీంపేటలోని స్పోర్ట్స్ పాఠశాలలో పలువురు విద్యార్థినులపై ఓ అధికారి వేధింపులు..తాజాగా మరో ఘటన వెలుగులోకి వచ్చింది. కాటేదాన్‌లోని ఓ ప్రైవేటు స్కూల్లో 10వ తరగతి విద్యార్థినులను ప్రిన్సిపల్(principal) లైంగిక వేధింపులకు గురిచేస్తున్నట్లు బయటకొచ్చింది.
sexual harassment of tenth students principals case katedan hyderabad
హైదరాబాద్(hyderabad) పరిధిలోని స్కూళ్లు, కాలేజీలలో ఇటివల కాలంలో లైంగిక వేధింపుల ఘటనలు ఎక్కువయ్యాయి. తాజాగా విద్యార్థులను లైంగికంగా వేధించిన మరో ఘటన వెలుగులోకి వచ్చింది. పదోతరగతి విద్యార్థినులను లైంగికంగా వేధించిన రాకేష్ విద్యానికేతన్ పాఠశాల ప్రిన్సిపాల్(principal)పై మైలార్‌దేవ్‌పల్లి(mailardevpally) పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కాటేదాన్‌లోని రాకేష్ విద్యానికేతన్ ప్రిన్సిపాల్ జి శంకర్ విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తించాడు.
అయితే ఆ లైంగిక వేధింపులు భరించలేక పలువురు విద్యార్థినులు తమ తల్లిదండ్రులకు(parents) సమాచారం అందించారు. దీంతో కోపోద్రిక్తులైన తల్లిదండ్రులు పాఠశాలకు చేరుకుని విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తించడంపై ప్రశ్నించారు. అయితే వారి ఆరోపణలను ప్రిన్సిపాల్ తోసిపుచ్చారు. దీంతో తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించగా శంకర్‌పై షీ టీమ్‌కు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై మైలార్‌దేవ్‌పల్లి పోలీసులు కేసు నమోదు చేసి తదుపరి దర్యాప్తు చేస్తున్నారు.
మరోవైపు నిన్నహకీంపేటలోని స్పోర్ట్స్ స్కూల్లో చదువుతున్న విద్యార్థినులపై ఓ అధికారి లైంగిక వేధింపులకు పాల్పడినట్లు వెలుగులోకి రాగా..క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఈ ఘటనపై స్పందించి అతన్ని సస్పెండ్ చేస్తు చర్యలు తీసుకున్నారు. అంతేకాదు గతంలో ఓ ఇంటర్మీడియట్ విద్యార్థినిని లైంగికంగా వేధించిన నారాయణ జూనియర్ కాలేజీ ప్రిన్సిపాల్‌పై మల్కాజిగిరి పోలీసులు(police) కేసు నమోదు చేశారు.