హైదరాబాద్ (Hyderabad) లో భారీ పేలుడు సంభవించింది. మణికొండ (Manikonda) ప్రాంతంలోని లాలమ్మ గార్డెన్లో పేలుడు చోటు చేసుకుంది. చెత్త ఏరుకుంటున్న ఓ వ్యక్తికి తీవ్ర గాయాలైనట్లు సమాచారం. గాయపడ్డ వ్యక్తిని చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రి(Hospital)కి తరలించారు. ఖాళీ ప్లాట్ లో ఉన్న చెత్త తీసుకుంటుండగా ఒక్కసారిగా పేలుడు సంభవించింది. ఒక్కసారిగా భారీ శబ్దం రావడంతో స్థానికులు భయ భ్రాంతులకు గురయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు(police) హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్నారు. పేలుడు జరిగిన ప్రాంతంలో జనాలు ఎవరు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది. అయితే కెమికల్ డబ్బాలు (Chemical cans)పేలినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు