»Fraud In The Name Of High Interest Couple Cheating With Rs 175 Crore Bapatla Ap
High interest: పేరుతో మోసం..రూ.1.75 కోట్లతో ఉడాయించిన దంపతులు
ఓ దంపతులు అధిక వడ్డీ పేరుతో పలువురి నుంచి దాదాపు రెండు కోట్ల రూపాయలు తీసుకుని రాత్రికి రాత్రే ఇల్లు ఖాళీ చేసి వెళ్లిపోయారు. ఇది తెలిసిన బాధితులు మోసపోయామని తెలుసుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటన ఏపీలో జరిగింది.
ఓ ఫ్యామిలీ అప్పుల పేరుతో పెద్ద స్కాం(scam) చేశారు. అది కూడా ఎంత డబ్బు అనుకుంటున్నారు. ఒకటి కాదు రెండు కాదు. ఏకంగా రూ.1.75 కోట్ల రూపాయలు పలువురి వద్ద నుంచి వసూలు చేశారు. ఇక పైసలు ఇచ్చిన వారికి తిరిగి ఇవ్వకుండా వారినే బెదిరిస్తున్నారు. ఆ క్రమంలోనే ఆ దంపతులు ఇల్లు వదిలి వెళ్లిపోయారని బాధితులు చెబుతున్నారు. అసలు విషయం తెలుసుకున్న బాధితులు మోసపోయామని గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటన ఏపీలోని బాపట్ల జిల్లా జాండ్రపేటలో చోటుచేసుకుంది.
గతంలో అధికంగా వడ్డీ ఇస్తామని రమేష్, అరుంధతి దంపతులు ఒకరికి తెలియకుండా మరొకరి వద్ద పెద్ద ఎత్తున నగదు తీసుకున్నారు. ఈ విధంగా సుమారు 30 మంది దగ్గర డబ్బుసు వసూలు చేశారు. ఎన్ని రోజులైనా కూడా వారు డబ్బులు తిరిగి ఇవ్వకపోవడంతో ఆయా బాధితులు నిలదీశారు. దీంతో వారిపైనా కేసులు పెడతామని బెదిరింపులకు దిగారు. ఈ నేపథ్యంలో వారు ఇల్లు ఖాళీ చేసిన వెల్లినట్లు తెలుస్తోంది. దీంతో వారిపై అనుమానం వచ్చిన బాధితులు పోలీసులకు తెలుపడంతో వారిపై కేసు నమోదు చేసిన పోలీసులు(police) దర్యాప్తు చేస్తున్నారు.