Cyber Cheaters: సైబర్ మోసగాళ్లు (Cyber Cheaters) కొత్త కొత్త పంథాను ఎంచుకుంటున్నారు. జనం ఎలా అయితే తమ ట్రాప్‌లో పడతారో ఆలోచించి మరీ ఎత్తులు వేస్తున్నారు. ఇప్పుడు మామిడి పండ్ల విక్రయాల పేరుతో చీట్ చేస్తున్నారు.నకిలీ వెబ్ సైట్ పట్ల అప్రమత్తంగా ఉండాలని సైబర్ పోలీసులు వార్నింగ్ ఇస్తున్నారు.
ఆన్ లైన్లో (online) ఆర్డర్ ఇస్తే ఫ్రెష్ మామిడి పండ్లు ఇంటికి పంపిస్తామని ప్రకటన ఇస్తున్నారు. అందులో మాత్రం నకిలీ వెబ్ సైట్ లింక్ ఉంటాయి. సో.. వాటిని ఓపెన్ చేయొద్దు. అలా ఓపెన్ చేశామో ఇక అంతే సంగతులు.. ఫస్ట్ హాఫ్ పేమెంట్ అంటారు.. తర్వాత మొత్తం డబ్బులు కట్టాలని.. అప్పుడే డిస్కౌంట్ అని డ్రామాకు తెరతీస్తారు.
వాళ్లు చెప్పేవి అన్నీ నమ్మేట్టు ఉంటాయి. అలా నమ్మారో అంతే సంగతులు. పళ్ల కోసం చూసి మీ కళ్లు కాయలు కాస్తాయో తప్ప.. మామిడి పండ్లు మాత్రం రావు. మామిడి పండ్లు పంపిస్తామని దేశవ్యాప్తంగా చాలా వైబ్ సైట్లు (web sites) ఉన్నాయని కేంద్ర హోం శాఖ (home ministry) అంటోంది. సైబర్ నేరాలపై అప్రమత్తం చేసే పోర్టల్ ‘సైబర్ దోస్త్’లో వెల్లడించింది.
మామిడి పండ్లే కాదు.. ఏ సీజన్ ఉంటే ఆ సీజన్లో పళ్ల గురించి ప్రకటన ఇస్తున్నారు. సో.. ఎప్పుడూ అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నారు. ఫ్రూట్స్ (fruites) కొనుగోలు చేసే ముందు ఆ వెబ్ సైట్ గురించి తెలుసుకోవాలని సజెస్ట్ చేస్తున్నారు. ఆన్ లైన్లో కొనుగోలు చేసిన.. క్యాష్ ఆన్ డెలివరీ పెట్టాలని సూచిస్తున్నారు. అలా అయితే ఛీట్ అయ్యే అవకాశం ఉండదు. ఒకవేళ మోసపోయామని గుర్తిస్తే 1930 టోల్ ఫ్రీ నంబర్‌కు ఫిర్యాదు చేయాలని కోరారు.