»The Strange Thing Neem Tree Has Mangoes Here Is The Video
Viral News: బ్రహ్మంగారు చెప్పిన వింత.. వేప చెట్టుకు మామిడి పండ్లు.. ఇదిగో వీడియో
వేపచెట్టుకు మామిడి కాయలు కాయడం ఎప్పడైనా చూశారా.. అయితే ఈ వీడియో చూస్తే కచ్చితంగా ఆశ్చర్యపోతారు. బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో చెప్పినట్లే ఈ వింత ఉందంటూ నెటిజనులు కామెంట్లు చేస్తున్నారు.
The strange thing Neem tree has mangoes.. Here is the video
Viral News: కలియుగంలో చాలా వింతలు జరుగుతున్నాయి అందుకే విపత్తులు వస్తున్నాయని చాలా మంది నమ్ముతున్నారు. ఇదంతా బ్రహ్మంగారు కాలజ్ఞానంలో ముందే చెప్పారు అని వాదించేవారు చాలా మంది ఉన్నారు. తాజాగా మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లో ఓ వింత చోటుచేసుకుంది. వేప చెట్టుకు మామిడికాయలు కాస్తున్నాయి. గుత్తులు గుత్తులుగా వేలాడిన మామిడి కాయలను చూడడానికి ప్రజలు ఎగబడ్డారు. అసలు విషయంలోకి వెళితే.. బోపాల్ రాష్ట్ర పంచాయతీ గ్రామీణాభివృద్ధి, కార్మిక శాఖ మంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్ అధికారిక నివాసం సమీపంలో ఓ వేప చెట్టు ఉంది. దానికి మామిడికాయలు కాయడం మంత్రి గమనించారు. దాన్ని సోషల్ మీడియాలో పోస్టు చేశారు. దాంతో ఈ పోస్ట్ ఇప్పుడు తెగ వైరల్గా మారింది.
మంత్రి మంత్రి స్వయంగా వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఈరోజు తన ఇంటి ఆవరణలోని వేప చెట్టును దగ్గరకెళ్లి చూసి ఆశ్చర్యపోయినట్లు… వేపచెట్టుకు మామిడికాయలు చూసి తన మనసు పులకరించిపోయింది అని రాసుకొచ్చారు. అంతే కాకుండా ఎంతో ప్రతిభ గల తోటమాలి ఈ ప్రయోగం చేసి ఉంటాడని, నిజంగా ఇది గొప్ప అద్భుతం అని పోస్టు చేశాడు. అంతే కాదు మంత్రి ప్రహ్లాద్ పటేల్ ఈ సమాచారాన్ని వ్యవసాయ శాస్త్రవేత్తలకు తెలయజేశారు. అధికారులు ఆ చెట్టును పరిశీలించారు. వేపచెట్టుకు సుమారు 20 నుంచి 25 ఏళ్లు ఉంటాయని, వేప కొమ్మలో మామిడి కొమ్మ కూడా ఉందని చెప్పారు. అయితే పేపకొమ్మపై మామిడి పూత పడడం వలన ఇలాంటి సంఘటనలు జరుగుతుంటాయని ప్రతిభా సింగ్ లో వృక్షశాస్త్రజ్ఞుడు చెప్పారు.
आज भोपाल निवास पर नीम के वृक्ष पर आम के फल देखकर नज़दीक जाकर देखा तो मन गदगद हो गया ।किसी हुनरमंद बागवान ने वर्षों पहले यह प्रयोग किया होगा जो अचंभे से कम नहीं है । pic.twitter.com/TmZ2I0rfjT
— Prahlad Singh Patel ( वृक्ष से जल, जल से जीवन) (@prahladspatel) May 24, 2024