»Mahesh Babu With White Cat Paris Vacation Tour Pics Viral
Mahesh Babu: తెల్ల పిల్లితో మహేష్ బాబు..ప్యారిస్ టూర్ పిక్స్ వైరల్
స్టార్ హీరో మహేష్ బాబు(Mahesh Babu) తన ఫ్యామిలీతో కలిసి మళ్లీ ఫారెన్ టూర్ వెళ్లారు. ఈ క్రమంలో ప్యారిస్ వీధుల్లో తన కుమార్తెతో కలిసి ఎంజాయ్ చేస్తున్న చిత్రాలతోపాటు ఇంకొన్ని ఫొటోలను తన ఇన్ స్టా వేదికగా పంచుకున్నారు.
టాలీవుడ్ సూపర్ స్టార్ హీరో మహేష్ బాబు(Mahesh Babu) తన భార్య నమ్రతా శిరోద్కర్ ఫ్యామిలీతో కలిసి మళ్లీ ప్యారిస్ వెకేషన్ టూర్ వెళ్లారు. ఈ సందర్భంగా పిల్లలు గౌతమ్, సితారతో కలిసి ప్యారిస్ వీధుల్లో సరదాగా గడుపుతున్నారు. ఈ క్రమంలో నటుడు మహేష్ బాబు వారి వెకేషన్ టూర్ చిత్రాలను తన ఇన్ స్టా గ్రామ్ వేదికగా పంచుకున్నారు. ఆ చిత్రాల్లో పిల్లి, అతని కుమార్తె సితారతో ఉన్న చిత్రాలు ఉన్నాయి.
ఒక ఫొటోలో మహేష్ బాబు పెర్షియన్ తెల్ల పిల్లిని తన చేతుల్లో పట్టుకుని ఉన్న చిత్రాన్ని గమనించవచ్చు. నీలిరంగు డెనిమ్ జీన్స్, ఫార్మల్ జాకెట్‌తో తెల్లటి టీషర్ట్ ధరించి మహేష్ ఉన్నారు. ఆ క్రమంలో మహేష్ పిల్లిని బుజ్జగిస్తున్నట్లుగా కనిపిస్తున్నాడు. మరొక ఫొటోలో నటుడు తన కుమార్తె సితారతో ఉన్నాడు. అతను ఆమెను ప్రేమతో హత్తుకోవడం ఆ చిత్రంలో గమనించవచ్చు. ఆ చిత్రాలు చూస్తుంటే తండ్రి-కుమార్తెలు ప్యారిస్‌లో తెగ ఎంజాయ్ చేస్తున్నట్లు అనిపిస్తుంది. ఈ చిత్రాలు చూసిన నెటిజన్లు సూపర్ అంటూ పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు.
నిన్న నమ్రతా శిరోద్కర్ తమ సెలవుల టూర్ గురించి ఒక కుటుంబ చిత్రాన్ని పంచుకున్నారు. ఆ ఫోటోలో సితార, ఆమె స్నేహితురాలు సెల్ఫీకి పోజులివ్వడం చూడవచ్చు. పారిస్‌కు ముందు శిల్పా శిరోద్కర్‌తో కలిసి తల్లి, కుమార్తె ద్వయం వారి ఇష్టమైన గమ్యస్థానమైన స్విట్జర్లాండ్‌లో సైతం విహారయాత్ర చేశారు.
ఇదిలా ఉండగా వృత్తిపరంగా మహేష్ బాబు ప్రస్తుతం దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో కలిసి SSMB28 అనే మూవీలో నటిస్తున్నారు. అయితే వీరిద్దరి కలయికలో గతంలో అతడు, ఖలేజా వంటి బ్లాక్‌బస్టర్స్ వచ్చాయి. ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. మరోవైపు ఈ మూవీలో నటి శ్రీలీల కూడా కనిపించనుంది. SSMB28 సంక్రాంతి సందర్భంగా జనవరి 13, 2024న థియేటర్లలో విడుదల కానుంది. దీని తరువాత మహేష్ బాబు RRR దర్శకుడు SS రాజమౌళి SSMB29లో యాక్ట్ చేయనున్నారు. ఈ చిత్రం మూడు పార్టులుగా ఉంటుందని తెలిసింది.