IPL 2023: ఒక్క పరుగు తేడాతో కోల్‌కతాను ఓడించిన లక్నో
లక్నో సూపర్ జెయింట్స్(LSG) తమ చివరి లీగ్ మ్యాచులో కోల్‌కతా నైట్ రైడర్స్(KKR) జట్టును ఒక్క పరుగు తేడాతో ఓడించింది. శనివారం జరిగిన మ్యాచులో ఇది జరుగగా లక్నో ఐపీఎల్(IPL 2023)ప్లే-ఆఫ్స్‌కు అర్హత సాధించగా..కోల్‌కతా ప్లే ఆఫ్ ఆశలను కోల్పోయింది.
చెన్నై సూపర్ కింగ్స్ (CSK) గెలుపు తర్వాత నిన్న లక్నో సూపర్ జెయింట్స్ (LSG) కూడా తన ప్లేఆఫ్ ఆశలను సజీవం చేసుకుంది. నిన్న(మే 20న) కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR)తో జరిగిన మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ కేవలం ఒక పరుగు తేడాతో విజయం సాధించింది. కానీ ఈ క్రమంలో LSG.. CSKని అధిగమించే అవకాశాన్ని కూడా కోల్పోయింది.
శనివారం ఈడెన్ గార్డెన్స్‌లో జరిగిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023 మ్యాచులో లక్నో సూపర్ జెయింట్స్ ఒక్క పరుగు తేడాతో కోల్ కత్తాపై ఉత్కంఠభరితమైన విజయం సాధించి రెండో ప్లే ఆఫ్స్ బెర్త్‌ను ఖరారు చేసుకుంది. మొదట టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన లక్నో8 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది. ఇక 177 పరుగుల లక్ష్యంతో చేధనకు దిగన కోల్ కత్తా జట్టు విఫలమైంది. ఈ క్రమంలో ప్రధానంగా రింకు సింగ్ 33 బంతుల్లో 67, జాసన్ రాయ్ 45 రన్స్ తప్ప మిగతా ఆటగాళ్లు పెద్దగా పరుగులు చేయలేదు. దీంతో కేకేఆర్ 7 వికెట్ల నష్టానికి 175 పరుగుల వద్ద ఒక పరుగు తేడాతో మ్యాచ్‌ను కోల్పోయింది. ఈ క్రమంలో లక్నో బౌలర్లు రవి బిష్ణోయ్, యశ్ ఠాకూర్ చెరో రెండు వికెట్లు పడగొట్టగా..కృష్ణప్ప గౌతం, కృనాల్ పాండ్యా తలో వికెట్ తీశారు.
మరోవైపు ప్లేఆఫ్ క్వాలిఫికేషన్ కోసం కోల్‌కతా ఆశలు ముగియడంతో లక్నో పాయింట్ల పట్టికలో మూడవ స్థానానికి చేరింది. ఇక గుజరాత్ 1లో ఉండగా, చెన్నై రెండో ప్లేస్ కు వచ్చేసింది. క్వాలిఫయర్ 1 మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్‌తో CSK ఢీకొంటుండగా, ఆదివారం మే 21న జరిగే చివరి ఎలిమినేటర్ పోరు తర్వాత LSGకి తమ ప్రత్యర్థి ఎవరనేది తెలుస్తుంది.