»Lovers Grand Wedding In The Maharashtra Graveyard
Viral News: శ్మశానంలో వైభవంగా ప్రేమజంట పెళ్లి
శ్మశానంలో ఓ ప్రేమ జంట పెళ్లి చేసుకుంది. అంతేకాదు వారి పెళ్లిని ఇరు కుటుంబాలు దగ్గరుండి మరి జరిపించడం విశేషం. ఇది ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కోడుతుంది. ఆ వివరాలెంటో ఇప్పుడు చుద్దాం.
జీవితంలో పెళ్లి(marriage) అనేది ఓ పండుగ అంటుంటారు. అందుకే ఎంత వీలైతే అంత అంగరంగ వైభవంగా షాదీ చేసుకుంటున్నారు నేటి యువత. తాజాగా మహారాష్ట్ర(Maharashtra)లో వెలగులోకి వచ్చిన ఓ అరుదైన ఘటన అందరిని ఓ క్షణం ఆలోచనలలో పడేసింది. శ్మశానంలో ఓ ప్రేమ జంట పెళ్లి చేసుకుంది. అదేంటి శ్వాశానమంటారు, పెళ్లంటారు అనుకుంటున్నారా. మాములుగా అయితే అలాంటి చోట ఏడుపులు, పెడబొబ్బులు వినిపిస్తాయి. కానీ వినుత్నంగా భజంత్రీలు వినిపించాయి. అందిరి సమక్ష్యంలో అట్టహాసంగా ఈ తంతు జరిగింది. వివరాలలోకి వెలితే..
మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్(Ahmednagar) జిల్లా శిర్డీ సమీపంలోని రహతా గ్రామానికి చెందిన గంగాధర్ స్థానిక శ్మశానంలో కాటికాపరిగా పనిచేస్తున్నారు. కొన్నాళ్లుగా ఆయన తన కుటుంబంతో కలిసి శ్వశాసనంలో నివాసముంటున్నారు. వారిది మహాసంజోగీ సామాజిక వర్గం. కాపరులుగా ఉండే వృత్తి వారిది.
గంగాధర్ కుమార్తె మయూరీ శ్మశానంలోనే పుట్టి పెరిగింది. అక్కడి నుంచే 12వ తరగతి వరకూ చదువుకుంది. చదువునే సమయంలో పరిచయం అయిన శిరిడీకి చెందిన మనోజ్ అనే యువకుడిని ఆమె ప్రేమించింది. విషయం ఇంట్లో చెప్పడంతో ఇరు కుటుంబాలు సంతోషంగా ఒప్పుకున్నాయి. అయితే మయూరీ పుట్టి పెరిగినచోటే ఆమె పెళ్లి చేయాలని గంగాధర్ కోరడంతో ఆ జంట వివాహం శ్మశానంలో బంధువులు, స్నేహితుల నడుమ మేళతాలతో అద్భుతంగా జరిగింది. ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది.