హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో కుండపోత వర్షం కురుస్తోంది. సికింద్రాబాద్(Secunderabad), పంజాగుట్ట, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, మాదాపూర్, కొండాపూర్, కృష్ణానగర్, యూసఫ్ గూడ, ఉప్పల్, అంబర్పేట్, ముషీరాబాద్, ఆల్వాల్, బేగంపేట్, చిలకలగూడ, బోయినపల్లి సహా మరికొన్ని ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు (Heavy rains) కురిసే అవకాశం ఉన్నందున జీహెచ్ఎంసీ అప్రమత్తమైంది. ఈ మేరకు నగరంలో హై అలెర్ట్(High alert)ను ప్రకటించింది.
అత్యవసర పరిస్థితుల్లో తప్ప మిగతా సమయాల్లో బయటకు రావొద్దని విజ్ఞప్తి చేసింది. 70లక్షల మందిని ఎస్ఎంఎస్ల ద్వారా అప్రమత్తం చేసింది.అత్యవసర సమయాల్లో సహాయం కోసం 9000113667 నంబర్లో సంప్రదించాలని డైరెక్టర్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్ విజిలెన్స్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ చేసిన ట్విట్టర్ (Twitter) ద్వారా కోరింది.రేపు ఉత్తర తెలంగాణతో పాటు సెంట్రల్ తెలంగాణతో పాటు హైదరాబాద్ (Hyderabad), పరిసరర ప్రాంతాల్లోనూ పలుచోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది.