కుర్ర హీరోలంతా ఇప్పుడు పెళ్లి పీఠలెక్కేందుకు రెడీ అవుతున్నారు. ఇటీవలె టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ పెళ్లి చేసుకున్నాడు. త్వరలోనే మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కూడా లావణ్య త్రిపాఠిని పెళ్లాడబోతున్నాడు. ఇప్పుడు వీళ్ల దారిలోనే మరో యంగ్ హీరో పెళ్లికి రెడీ అవుతున్నాడు. అతనెవరో కాదు.. కోలీవుడ్ యంగ్ హీరో కవిన్(kavin).
ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాలో నాని ఫ్రెండ్‌గా, లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్, నువ్విలా లాంటి సినిమాలో కీ రోల్ ప్లే చేశాడు విజయ్ దేవరకొండ. కెరీర్ స్టార్ట్ అయింది క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గానే అయినా.. పెళ్లి చూపులు సినిమాతో హీరోగా సాలిడ్ బ్రేక్ అందుకున్నాడు విజయ్ దేవరకొండ. ఆ తర్వాత అర్జున్ రెడ్డి, గీతా గోవిందం సినిమాలతో హీరోగా జెండా పాతేశాడు. కోలీవుడ్‌లో కూడా రౌడీ హీరోలాగే క్యారెక్టర్ ఆర్టిస్ట్ మొదలై.. హీరోగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు కవిన్(kavin) అనే యంగ్ హీరో. సీరియల్ యాక్టర్‌గా కెరీర్ ప్రారంభించిన కవిన్.. కార్తిక్ సుబ్బరాజు దర్శకత్వంలో వచ్చిన పిజ్జా సినిమాలో ఓ చిన్న రోల్లో కనిపించాడు. ఆ తర్వాత రెండు, మూడు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించాడు. కానీ ‘నట్పున ఎన్నాను తెరియుమా’ అనే సినిమాతో కోలీవుడ్‌లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.
ఇక దాదా అనే సినిమాతో కవిన్ సెన్సేషన్ క్రియేట్ చేశాడు. ఈ ఏడాది ఫిబ్రవరిలో రిలీజైన ఈ సినిమా తమిళం(tamil)లో భారీ విజయాన్ని అందుకుంది. కేవలం రూ.4 కోట్లతో రూపొందిన ఈ మూవీ సుమారు రూ.20 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. ప్రస్తుతం కవిన్ నటిస్తున్న రెండు సినిమాలు సెట్స్ పై ఉన్నాయి. ఇలాంటి సమయంలో కవిన్ పెళ్లి పీటలెక్కబోతున్నట్టు కోలీవుడ్ వర్గాల్లో జోరుగా వినిపిస్తోంది. గత కొన్ని రోజులుగా మోనికా అనే అమ్మాయితో ప్రేమలో ఉన్నాడు కవిన్. ఇప్పటికే ఎంగేజ్మెంట్ కూడా చేసుకున్నాడు. కానీ ఆ ఫోటోలు బయటికి రాకుండా చూసుకున్నాడు. ఇప్పుడు ఆమెతో కలిసి ఆగస్టు 20న ఏడడగులు వేసేందుకు రెడీ అవుతున్నాడట. ఇప్పటికే పెళ్లికి సంబంధించిన పనులు కూడా స్టార్ట్ అయినట్లు సమాచారం. ఈ పెళ్లికి ఇరు కుటుంబ సభ్యుల(tamily)తో పాటు అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరు కానున్నట్లు టాక్.