»Kcr Has Cheated Unemployed Youth Ys Sharmila Alleges
Unemployed youthను ద్రోహం చేసిన కేసీఆర్: షర్మిల
YS Sharmila:సీఎం కేసీఆర్‌పై షర్మిల (YS Sharmila) నిప్పులు చెరిగారు. నిరుద్యోగ యువతకు ఆయన ద్రోహం చేశారని మండిపడ్డారు. ఈ మేరకు ఆమె ట్వీట్ చేశారు. రెండోసారి సీఎం అయ్యాక ఒక ఉద్యోగం కూడా కల్పించలేదన్నారు. బిస్వాల్ కమిటీ చెప్పినట్టు 1.91 లక్షల ఖాళీలు భర్తీ చేయాలని కోరారు. అలాగే టీఎస్ పీఎస్సీ పేపర్ లీకేజీపై సీబీఐ విచారణ జరిపించాలని షర్మిల డిమాండ్ చేశారు.
Kcr has cheated unemployed youth YS Sharmila alleges
YS Sharmila:సీఎం కేసీఆర్‌పై షర్మిల (YS Sharmila) నిప్పులు చెరిగారు. నిరుద్యోగ యువతకు ఆయన ద్రోహం చేశారని మండిపడ్డారు. ఈ మేరకు ఆమె ట్వీట్ చేశారు. రెండోసారి సీఎం అయ్యాక ఒక ఉద్యోగం కూడా కల్పించలేదన్నారు. బిస్వాల్ కమిటీ చెప్పినట్టు 1.91 లక్షల ఖాళీలు భర్తీ చేయాలని కోరారు. అలాగే టీఎస్ పీఎస్సీ పేపర్ లీకేజీపై సీబీఐ విచారణ జరిపించాలని షర్మిల డిమాండ్ చేశారు. ఏడాది క్రితం అసెంబ్లీ సాక్షిగా చేసిన 80 వేల ఉద్యోగాల నోటిఫికేషన్ మాట మరిచారని మండిపడ్డారు. 26 వేలకే నోటిఫికేషన్ ఇచ్చి.. లీకేజీతో గల్లంతు అవుతున్నాయని పేర్కొన్నారు. జాబ్ క్యాలెండరు లేదు, కొత్త జిల్లాల పాలనకు 3 లక్షల పైగా కొలువుల భర్తీ ఊసే లేదన్నారు.
“గతేడాది మార్చి 9వ తేదీన అసెంబ్లీ వేదికగా కేసీఆర్ కొలువుల భర్తీ గురించి ప్రకటన చేశారు. ఏడాది లోపు 80వేల ఉద్యోగాల భర్తి చేస్తామని చెప్పారు. జాబ్ క్యాలెండర్లు, కొలువులు అని పాలాభిషేకం చేయించుకున్నాడు. ఏడాది అయిపాయె, రెండు ఉగాదులు గడిచిపాయే, ఎక్కడ ఉద్యోగాలు? 80వేల ఉద్యోగాలలో ఇప్పటివరకు నోటిఫికేషన్లు విడుదల అయ్యింది కేవలం 26 వేల ఉద్యోగాలకు మాత్రమే. 54 వేల ఉద్యోగాలకు ఇంతవరకు నోటిఫికేషన్ లేదు. కేసీఆర్ రెండో సారి ముఖ్యమంత్రి అయ్యాక, ఇప్పటివరకు ఒక్క ఉద్యోగం కూడ ఇవ్వకుండా మోసం చేశారు’ అని షర్మిల (YS Sharmila) విరుచుకుపడ్డారు.
“బిశ్వాల్ కమిటీ (Biswal committee) లెక్కల ప్రకారం రాష్ట్రంలో 1.91లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాల్సి ఉంది. మొత్తం ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేయలేదని చెప్పారు. ఎన్నికలు దగ్గరపడుతుండటంతో 80వేల ఉద్యోగాలు భర్తీ అని ఊదరగొట్టాడు. ఒక్క ఉద్యోగం ఇచ్చింది లేదు. 26 వేలకు నోటిఫికేషన్ ఇచ్చి పరీక్ష పత్రాలను లీక్ చేశారు. ఇప్పుడు పరీక్షలు రద్దు చేశాడు. పరీక్ష రాసిన 10 లక్షల మంది నిరుద్యోగుల గుండెల్లో గునపాలు దింపాడు. మళ్ళీ పరీక్షలు అని మోసం చేస్తున్నారు. ఆరునెలల్లో భర్తీ చెయ్యడం సాధ్యమేనా? మళ్ళీ ప్రజల వద్దకు వెళ్లి, మమ్మల్ని ఎన్నుకోండి, లక్షల కొలువులు ఇస్తాం అని చెప్పే మోసం చేస్తారు’ అని షర్మిల (YS Sharmila) మండిపడ్డారు.
సెప్టెంబర్‌లో ఎన్నికల షెడ్యూల్ జారీ కానుండటంతో నియామకాల్లో ఆలస్యం జరిగితే ఎన్నికల కోడ్ సమయంలో అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వడం కుదరదు. ఉద్యోగాల అపాయింట్ మెంట్ ఆర్డర్‌కు చెక్ పడినట్లే అని షర్మిల గుర్తుచేశారు.
మన రాష్ట్రం, మన ఉద్యోగం అని చెప్పి 50 లక్షల మంది నిరుద్యోగులను మోసం చేశాడు. బంగారు తెలంగాణ పేరుతో 9 ఏళ్లలో ఇచ్చిన ఉద్యోగాల సంఖ్య అక్షరాల 65 వేలు దాటలేదు. 2015లో లక్ష ఉద్యోగాలు భర్తి చేస్తామని ప్రకటన చేసి, ఐదేండ్లు గడిచినా కేవలం 65 వేలతో సరిపెట్టాడు. కొత్త జిల్లాలు ఏర్పడిన తర్వాత, దాదాపు ప్రభుత్వ శాఖల్లో భర్తి చేయాల్సిన ఖాళీలు 3 లక్షలకు పైగా ఉన్నాయని.. వాటి ఊసే లేదన్నారు. బిడ్డ కోసం ఢిల్లీలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు చేత పాగావేయించి చూపే నిబద్ధత, గుండెమండుతున్న నిరుద్యోగ బిడ్డల పట్ల ఎందుకు లేదని షర్మిల (YS Sharmila) అడిగారు.
నిరుద్యోగులకు KCR చేసింది మోసం కాదు, ద్రోహం కూడా. రెండోసారీ ఉద్యోగాల భర్తీలో KCR మోసమే చేశారు. పేపర్ లీకేజీలపై వెంటనే CBI విచారణ జరిపించాలి. బిస్వాల్ కమిటీ చెప్పిన 1.91లక్షల ఉద్యోగాలు తక్షణమే భర్తీ చేయాలి. కొత్త జిల్లాల వారీగానూ ఖాళీలు నింపాలి. నిరుద్యోగులకు YSRTP అండగా ఉంటుంది. pic.twitter.com/5RIL0q59zJ