PM Modi write letter:మరికొన్ని గంటల్లో కర్ణాటక అసెంబ్లీకి ఎన్నిక జరగనుంది. ఓకే విడత జరిగే ఎన్నికల కోసం ఎన్నికల సంఘం ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేసింది. నిన్న సాయంత్రంతో ప్రచార పర్వం ముగియగా.. ప్రలోభాలకు తెరలేచింది. కర్ణాటకలో తిరిగి అధికారం చేజిక్కించుకోవాలని బీజేపీ అనుకుంటోంది. రాష్ట్రంలో ప్రధాని మోడీ (pm modi) సుడిగాలి పర్యటన చేశారు. తాజాగా కన్నడ ప్రజలకు ఆయన బహిరంగ లేఖ రాశారు.
దేశాభివృద్దికి రాష్ట్ర ప్రజల సహకారం ఎంతో అవసరం అని ప్రధాని మోడీ (pm modi) అభిప్రాయ పడ్డారు. మీరు ఎప్పుడూ తనపై ప్రేమ చూపించారని పేర్కొన్నారు. ప్రపంచంలో భారత్ ఐదో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థను కలిగి ఉంది.. మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం అని తెలిపారు. రాష్ట్రాల అభివృద్ధితోనే దేశం డెవలప్ అవుతుందని చెప్పారు. కర్ణాటక (karnataka) రాష్ట్రం వేగంగా డెవలప్ కావాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.
కరోనా సమయంలో కూడా బీజేపీ సర్కార్ ఏటా 90 వేల కోట్ల విదేశీ పెట్టుబడులను సాధించిందని మోడీ (modi) వివరించారు. గత ప్రభుత్వ హయాంలో అదీ రూ.30 వేల కోట్లుగా ఉండేదని చెప్పారు. పెట్టుబడుల విషయంలో కర్ణాటక (karnataka) రాష్ట్రాన్ని నంబర్ వన్‌గా మార్చాలని అనుకుంటున్నామని మోడీ (modi) పేర్కొన్నారు.
కర్ణాటకలో ప్రతీ పౌరుడి కల.. ఇక నుంచి తన స్వప్నం అవుతుందని మోడీ (modi) చెప్పారు. దీనికి సంబంధించి ఓ వీడియోను (video) విడుదల చేశారు. రేపు జరిగి అసెంబ్లీ ఎన్నికలకు ప్రతీ ఒక్కరూ తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు. కర్ణాటక అసెంబ్లీలో 224 అసెంబ్లీ స్థానాలు ఉన్న సంగతి తెలిసిందే. రేపు ఓకే విడతలో పోలింగ్ జరగనుండగా.. 13వ తేదీన ఓట్ల లెక్కింపు ప్రక్రియ చేపడుతారు. ఎగ్జిట్ పోల్ ప్రకారం కర్ణాటకలో బీజేపీకి షాక్ తగిలే అవకాశం ఉంది. అక్కడ కాంగ్రెస్ (congress) పవనాలు వీస్తున్నాయని.. ఆ పార్టీ అధికారం చేపడుతుందని అంచనా వేసింది.